షకీల చిత్రానికి సెన్సార్ నో.. రిక్వెస్ట్ చేసిన ‘శీలవతి’

Updated By ManamWed, 06/13/2018 - 14:46
shakila

Shakilaషకీల ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘శీలవతి’. కొన్ని కారణాల వలన చాలా రోజులుగా వాయిదా పడుస్తూ వస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ మూవీకి సెన్సార్ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. సినిమా పేరు మార్చాలంటూ సెన్సార్ చేయకుండానే వారు వెనక్కి పంపారు. పేరు మార్చితే కాని సినిమాకు సెన్సార్ చేయమని వారు చెప్పారు. దీంతో షకీల ఆవేదన వ్యక్తం చేసింది.

సినిమా చూడకుండానే టైటిల్ మార్చమని చెప్పడం కరెక్ట్ కాదని, శీలవతి పేరుతో చాలా వరకు ప్రమోషన్ చేశామని, ఇలాంటి పరిస్థితుల్లో టైటిల్‌ను మార్చలేం అంటూ ఓ వీడియోను విడుదల చేసింది. ఇప్పటికే సినిమా విడుదల ఆలస్యం అయ్యిందని, దీనిపై సెన్సార్ సభ్యులు ఆలోచించాలని ఆమె కోరింది. మరి ఆమె అభ్యర్థనపై సెన్సార్ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా ఈ చిత్రం షకీలకు 250వ చిత్రం కావడం విశేషం.

English Title
Shakila request to Censor Board
Related News