షారూక్ ముద్దాడుతున్న ఆ నటి ఎవరబ్బా..?

Updated By ManamWed, 06/13/2018 - 10:57
shah rukh

shah rukh బాలీవుడ్ నటులు షారూక్, గుల్షన్ గ్రోవర్‌లు ఓ నటిని ముద్దాడేందుకు పోటీ పడుతున్న ఫొటో ఒకటి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఆ ఫొటోలో ఉన్న నటి ఎవరంటూ నెటిజన్లు ఆరా తీశారు. వారిలో కొందరు సమాధానాన్ని చెప్పగా, మరొకొందరు దాని వెనుక కథను కూడా చెప్పేస్తున్నారు. ఇంతకు ఆ కహాని ఏమిటి, ఆ నటి ఎవరు అంటే..

అక్కడున్నది మరెవరో కాదు బాలీవుడ్ మిస్టర్ ఫర్‌పెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. 1995లో అశుతోశ్ గోవారికర్ తీసిన బాజీ చిత్రంలో ఓ సన్నివేశం కోసం ఆమిర్ అమ్మాయి వేషం వేసుకున్నాడు. ఆ వేషంలోనే ఉన్న ఆమిర్‌ను షూటింగ్ తరువాత షారూక్, గుల్షన్‌లు ముద్దాడుతూ ఓ ఫొటో తీసుకున్నారు. ఇదే ఫొటో తాజాగా వైరల్‌ అయ్యింది.

English Title
Shah Rukh Khan tries to kiss an actor in this throwback photo. Guess who?
Related News