బన్నీ ఐ లవ్ యు: షారూక్ ఖాన్

Shah Rukh Khan, Allu Arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ అంటే తనకు చాలా ఇష్టమని బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్ చెప్పాడు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో షారూక్ ‘జీరో’ అనే చిత్రంలో నటించగా.. మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా హైదరాబాద్‌ వచ్చాడు షారూక్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని పేర్కొన్నాడు.

‘‘అల్లు ఐ లవ్ యు.. ఓ రోజు నీ కోసం వచ్చి నీతో రోజంతా కచ్చితంగా గడుపుతా. అతడు చాలా ఇష్టమైన వ్యక్తి. చాలా అద్భుతమైన వ్యక్తి. చాలా టాలెంట్ ఉన్న హీరో’’ అంటూ షారూక్ కితాబిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దానిపై అల్లు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా జీరో మూవీ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

https://twitter.com/imsarathchandra/status/1073947115624120321

సంబంధిత వార్తలు