ఇర్ఫాన్ కోసం షారూక్ సాయం

Updated By ManamSun, 06/24/2018 - 11:02
shah rukh, Irrfan

shah rukh, irrfan అరుదైన క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ప్రస్తుతం లండన్‌లో చికిత్సను తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తన పరిస్థితిపై ఇటీవల ఆయన రాసిన ఓ భావోద్వేగపు లేఖ అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. ఇదిలా ఉంటే లండన్‌లో ఇర్ఫాన్ కోసం కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్ చేసిన సాయం ఇటీవల వెలుగులోకి రాగా.. దానిపై ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

లండన్‌కు వెళ్లేముందు షారూక్‌ని తన ఇంటికి ఆహ్వానించారట ఆయన భార్య సుతపా. ఆ సమయంలో ఇర్ఫాన్ వైద్యంపై సుతపా, షారూక్‌కు చెప్పగా.. లండన్‌లో అతడికి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకూడదని భావించిన షారూక్.. అక్కడ ఉన్న తన ఇంటి తాళాలను ఇర్ఫాన్‌కు అందించాడట. అయితే దానిని తీసుకునేందుకు ఇర్ఫాన్ నిరాకరించగా.. బలవంతంగా షారూక్ వాటిని ఇర్ఫాన్ చేతిలో పెట్టారట. ఇక ఈ విషయం తెలుసుకున్న షారూక్ అభిమానులు తమ హీరో గొప్ప మనసును పొగుడుతున్నారు.

English Title
Shah Rukh help to Shah Rukh Khan
Related News