కత్తుల సమరానికి సంకెళ్లు పడేనా?

Chicken rats

మన దగ్గరే కాదు. ప్రపంచంలోని చాలా దేశాల్లోనూ కోడిపందేలు నిర్వహిస్తుంటారు. ఆగ్నేయ ఆసియా దేశాల్లో ప్రభుత్వాలు నిషేధించినప్పటికీ రాజకీయ నాయకులు, మాఫియా ముఠాలు ఈ పందేలను నిర్వహించడం విశేషం. ఫిలిప్పీన్స్‌లో పండగలతో సంబంధం లేకుండా మామూలు రోజుల్లో కూడా కోళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహిస్తూనే ఉంటారు. పందెం జరిగే ప్రాంతాన్ని మన రాష్ట్రంలో బరి అంటారు. ఫిలిప్పీన్స్‌లో అరెంటా కొలీజియం అంటారు. థాయ్‌లాండ్, వియత్నాం, పాకిస్థాన్‌లో సింధ్, ముల్తాన్, బెలుచిస్తాన్ ప్రాంతాల్లోనూ కోడిపందేలు భారీగా సాగుతాయి. స్పెయిన్‌లో కానరి ద్వీపాలలో కోడిపందేలు సాగుతాయి. అయితే దేశం లోని మిగిలిన ప్రాంతాల్లో నిషేధం ఉంది. మెక్సికో, పెరూలోనూ కోడిపందేలు ఆడతారు. పెరూలో కత్తులు లేకుండా పోటీలు జరగుతాయి. బ్రెజిల్ దేశంలో కోడిపందేలు నిషేధం అయిప్పటికీ దేశం అన్ని ప్రాం తాల్లోనూ ఏటా పోటీలు జరుగుతూనే ఉంటాయి.

వరండాలో పంట ఉత్పత్తులు, వాకిట్లో అందమైన రంగవల్లులు.. వీధుల్లో హరిదాసుల సంకీర్తనలు- గంగిరెద్దుల విన్యాసాలు.. కూడళ్లలో భోగి మంటలు, ఇంటింటా పిండివంట సువాసనలూ, ఘుమఘుమ లూ.. ఇళ్లంతా సందడిగా బంధువులు, కొత్త  అల్లుళు ్ల- కొంటె మరదళ్ల వేళాకోళాలు.. సంక్రాంతి అంటే సందడే సందడి..! ఇదీ నాకు తెలిసిన సంక్రాంతి.. కానీ నేడు సంక్రాంతి కాస్త జూద’క్రాంతి’లా తయా రైంది. ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో పందెంకోళ్లు ముందే కూస్తున్నాయి. పందేలకు అను మతి ఇచ్చేది లేదని ముందుగానే అధికారులు ప్రక టించినా ఆ మూడురోజుల ముచ్చట నిరభ్యంతరంగా సాగుతుంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించు కొని ఆటవిడుపు కోసం అక్కడక్కడా నిర్వహించుకునే కోడిపందేలను నేడు సంస్కృతి, సంప్రదాయం ముసు గులో ‘సంక్రాంతి అంటేనే కోడిపందేలు.. కోడి పందేలు అంటేనే సంక్రాంతి’ అనే భావనను వ్యాపిం పజేశారు మన పాలకులు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పండుగుకు ప్రత్యేక మైన ప్రాముఖ్యత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఒకవైపు ఐక్యమత్యాన్ని, సామరస్యాన్ని పెంపొందిం చేందుకు ప్రజాసంఘాలు వివిధ రకాల ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహిస్తుంటే.. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోడిపందేలను వేడుకగా దగ్గరుండి మరీ నిర్వహిస్తున్నారు. కోడి పందేలు జరక్కుండా అడ్డుకోవాలని 2016 డిసెంబర్ 26న ఉమ్మడి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సంయుక్త తనిఖీ బృందాలు ఏర్పాటు చేయా లని, కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్‌పిలను ఆదేశించింది. కోర్టు ఆదేశాలకనుగుణంగా వివిధ జిల్లాస్థాయి పోలీసులు కూడా 144 సెక్షన్ అమ లు చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ పందేలను జరగనివ్వ బోమని ప్రగల్భాలు పలికారు. అయితే అవన్నీ ఉత్తుత్తి మాటలుగానే మిగిలిపోయాయి. ఎవరెన్ని ఆంక్షలు పెట్టినా అప్పటి నుంచి ఇప్పటి వరకూ సంక్రాంతి కోడిదే పైచేయి అయ్యింది. బరిలో నిలిచిన కోడే కాల రెగరేసింది. ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో నిర్వాహ కులు వేలాది బరులు ఏర్పాటు చేసి కోడిపందేలు యథేచ్ఛగా నిర్వహించారు. సంక్రాంతి మూడు రోజు లే కాదు ముందూ వెనక కలుపుకొని వారం రోజులూ కోడిపందేల్లో మద్యం ఏరులు దాటి నదులై పారింది. బెట్టింగుల రూపంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. అశ్లీల నృత్యాలు వంటి అసాం ఘిక కార్యకలాపాలు హద్దులు దాటి అడ్డూ అదుపు లేకుండా పోయాయి. గుండాటలూ, మూడుముక్క లాటలూ, అన్ని వ్యసనాలూ కోడిపందేల ముసుగులో రంజుగా సాగాయి. ఒక్క కోడిపందేలేంటీ? అనంత పురం జిల్లాలో తాడిపత్రి ఎమ్మెల్యే జెసి దివాకర్‌రెడ్డి పందుల పందేలను నిర్వహించగా.. కృష్ణా జిల్లాలో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పొట్టేళ్ల పందే లను నిర్వహించారు. అయితే సంక్రాంతి సందర్భంగా కేవలం తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించేందుకే కోడిపందేలు నిర్వహిస్తున్నామ ఒకపక్క ప్రభుత్వం, మరోపక్క నాయకులు చెప్తున్నా రు. ఈ వాదనలో ఆవగింజంత కూడా నిజం లేదు. కోడి పందేలు, వాటి మాటున జరిగే జూదాన్ని సం స్కృతి, సంప్రదాయం ముసుగులో ప్రోత్సహించడానికే తప్ప రాజసానికి ప్రతీక అనో, సంప్రదాయం అనో ఎంతమాత్రమూ కాదు. ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఏడాదీ ఇదే వ్యవహారం నడుస్తోంది. సంక్రాంతి అంటే కోడి పందేలేనన్న ఒరవడిని పాదుకొల్పడంలో అధికారపార్టీ, ప్రతిపక్షపార్టీలు సిగ్గు విడిచి మరీ కృత కృత్యమయ్యాయి. సంక్రాంతి నాడు జూద క్రాంతిని ప్రసరింపజేసి చట్టాలపైనే కాదు తమకు న్యాయస్థానా లపైనా గౌరవం లేదని నిరూపించారు. తమను పాలించే వారికే సిగ్గు లేనప్పుడు తమకెందుకు సిగ్గు అనుకున్నారో ఏమో ప్రతిపక్ష నాయకులు సైతం వారితో కలిసిపోయి జూదమాడారు. కోర్టు తీర్పును వక్రీకరించి నిర్వహించిన కోడిపందేలపై కొంతమంది కోర్టును అశ్రయించడంతో జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిలను సైతం బాధ్యులను చేసింది. 

సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం.. 2018లో అయినా కోళ్లకు కత్తులు కట్టకుండా ఢింకీ పందేలు మాత్రమే నిర్వహించాలని, కోర్టు ఆదేశాలను వక్రీ కరించి నిర్వహించే కోడిపందేలను అడ్డుకుని తీరాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అయి తే ఆ సంవత్సరమూ కోర్టు తీర్పును వక్రీకరిస్తూ కోడి పందేలను యథేచ్ఛగా నిర్వహించారు. పందేలను పోలీసు యంత్రాంగం అడ్డుకోలేకపోనప్పటికీ నిర్వాహ కులపై కేసులు నమోదు చేసింది. 1960 జంతు చట్టం, 1974 గేమింగ్ చట్టం చట్టాలను అతిక్రమించి, కోర్టు ఆదేశాలను ధిక్కరించి కోడిపందేలు, ఇతర జూద క్రీడలను నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 555 కేసులు నమోదు కాగా.. 1916  మందిని అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 436 కేసులు నమోదు చేసి, 1681 మందిని అరెస్టు చేశారు. కృష్ణా జిల్లాలో 382 కేసులు నమోదు కాగా.. 955 మందిని అరెస్టు చేశారు. విశాఖ జిల్లాలో 409 కేసులు నమోదు చేసి, 456 మందిని అరెస్టు చేశారు. గుంటూరు జిల్లాలో 289  కేసులు నమోదు కాగా.. 353 మందిని అరెస్టు చేశారు. విజయవాడలో 36 కేసులు నమోదు చేసి, 216 మందిని అరెస్టు చేశారు. రాజమండ్రి అర్బన్‌లో 69 కేసులు నమోదు కాగా.. 151 మందిని అరెస్టు చేసినట్లు పోలీసుల అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కోడిపందేలకు పెట్టింది పేరైన ఉభయ గోదావరి జిల్లా ల్లో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. అంతే మొ త్తంలో నిర్వాహకులు కూడా అరెస్టయ్యారు. అయితే చాలాప్రాంతాల్లో నిర్వాహకుల చేతుల్లో పోలీసులు కీలుబొమ్మలుగా మారారనే సమాచారమూ ఉంది. బరుల నిర్వాహకుల నుంచి మామూళ్లు తీసుకొని చూసీచూడనట్లు మిన్నకుండిపోయారనే ఆరోపణలూ లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఎన్నికల వేడి మొద లైంది. అధికార, ప్రతిపక్ష నాయకులు అక్కడక్కడా ఎన్నికల ప్రచారమూ మొదలెట్టేశారు. ఇక నోటిఫి కేషన్ వెలువడమే ఆలస్యం.. నేతలందరూ ప్రచారం లో మునిగిపోతారు. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో రానున్న సంక్రాంతి ఎన్నికల ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ప్రతి ఏటా జనవరిలో సంక్రాంతి పండుగ రావడం, ఈ ఏడు సాధారణ ఎన్నికలు జరగనుండటంతో నాయకులకు ఈ సంక్రాంతి... ఎన్నికల సంక్రాంతిగా మారింది. ప్రజలను ఆకట్టుకునేందుకు, తమతమ నియోజకవర్గాల్లో అధికార, ప్రతిపక్ష నేతలు సొంతంగానే బరులు ఏర్పాటు చేసేం దుకు సిద్ధమవుతున్నారు. తమ పలుకుబడిని చూపిం చి ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇదొక మంచి అవ కాశంగానూ భావిస్తున్నారు. 

మన దగ్గరే కాదు. ప్రపంచంలోని చాలా దేశాల్లోనూ కోడిపందేలు నిర్వహిస్తుంటారు. ఆగ్నేయ ఆసియా దేశాల్లో ప్రభుత్వాలు నిషేధించినప్పటికీ రాజకీయ నాయకులు, మాఫియా ముఠాలు ఈ పందే లను నిర్వహించడం విశేషం. ఫిలిప్పీన్స్‌లో పండ గలతో సంబంధం లేకుండా మామూలు రోజుల్లో కూడా కోళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహిస్తూనే ఉంటారు. పందెం జరిగే ప్రాంతాన్ని మన రాష్ట్రంలో బరి అంటారు. ఫిలిప్పీన్స్‌లో అరెంటా కొలీజియం అంటారు. థాయ్‌లాండ్, వియత్నాం, పాకిస్థాన్‌లో సింధ్, ముల్తాన్, బెలుచిస్తాన్ ప్రాంతాల్లోనూ కోడి పందేలు భారీగా సాగుతాయి. స్పెయిన్‌లో కానరి ద్వీపాలలో కోడిపందేలు సాగుతాయి. అయితే దేశం లోని మిగిలిన ప్రాంతాల్లో నిషేధం ఉంది. మెక్సికో, పెరూలోనూ కోడిపందేలు ఆడతారు. పెరూలో కత్తు లు లేకుండా పోటీలు జరగుతాయి. బ్రెజిల్ దేశంలో కోడిపందేలు నిషేధం అయిప్పటికీ దేశం అన్ని ప్రాం తాల్లోనూ ఏటా పోటీలు జరుగుతూనే ఉంటాయి. 
అల్లూరి ప్రభుకుమార్
8790988119

సంబంధిత వార్తలు