'అస్థానా ఆరోపణలు అంతా కల్పితం'

CBI vs CBI, Serious allegations, Rakesh Asthana, Alok Verma, Delhi High Court
  • ప్రజల్లో సీబీఐపై విశ్వాసనీయ సన్నగిల్లొద్దు..

  • అస్థానాపై పక్షపాతం లేని విచారణ ఎంతో అవసరం 

  • ఢిల్లీ హైకోర్టులో అలోక్ వర్మ వాదనలు.. 

న్యూఢిల్లీ: తనపై వచ్చిన తీవ్ర అవినీతి ఆరోపణలపై సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో వివరణ ఇచ్చారు. ప్రత్యే సీబీఐ డైరెక్టర్ రాకేశ్ అస్థానా తనపై చేసిన అవినీతి ఆరోపణలు అంతా కల్పితమని వర్మ కొట్టిపారేశారు. అస్థానా ఆరోపణలతో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాల్సిందిగా అలోక్ వర్మ ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించారు. అస్థానా సహా ఇతరులపై అవినీతి ఆరోపణలు చాలా  తీవ్రమైనవని, సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని వర్మ హైకోర్టుకు ఇచ్చిన తొలి వివరణలో వెల్లడించారు. అస్థానాపై వచ్చిన ఆరోపణలపై పరిపూర్ణంగా విచారణ జరపాలని, అప్పుడే సీబీఐపై ప్రజల్లో విశ్వసనీయత సన్నగిల్లకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుందని కోర్టుకు విన్నవించారు.

మరోవైపు అలోక్ వర్మను అర్థాంతరంగా సెలవుపై పంపిన ప్రభుత్వ నిర్ణయంపై దాఖలైన పిటిషన్ విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై గురువారం విచారించిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈ కేసును సుప్రీం రిజర్వులో ఉంచింది. సీబీఐలో ఇద్దరు డైరెక్టర్లు ఒకరిపై నొకరు పరస్పరం అవినీతి ఆరోపణలు గుప్పించుకోవడంతో ప్రభుత్వం వారిద్దరిని సెలవుపై పంపిన సంగతి విదితమే.  

సంబంధిత వార్తలు