ఫైనల్లో సెరెనా, కెర్బర్

Updated By ManamThu, 07/12/2018 - 23:11
serena-williams
  • వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ 2018

serena-williamsవింబుల్డన్: మాజీ చాంపియన్, అవెురికా స్టార్ 25వ సీడ్ సెరెనా విలియమ్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్‌లో బ్లాక్ బ్యూటీ సెరెనా జర్మనీకి చెందిన 13వ సీడ్ జులియా జార్జిస్‌ను 6-2, 6-4తో చిత్తు చేసింది. మొదటి సెట్లో అద్భుతమైన ఆటతో జార్జిస్‌కు చెవుటలు పట్టించిన సెరెనా 6-3తో మొదటి సెట్‌ను గెలుపొందింది. అదే ఫామ్‌ను  కొనసాగించిన సెరెనా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా ఆడి రెండో సెట్‌ను కూడా కైవసం చేసుకుని మ్యాచ్‌ని తన సొంతం చేసుకుంది. 7 సార్లు వింబుల్డన్ టైటిల్‌ను కైవసం చేసుకున్న సెరెనా ఎనిమిదోసారి కూడా టైటిల్‌ను గెలిచేందుకు సిద్ధమైంది. ఇక్కడ జరిగిన మరోమ్యాచ్‌లో జర్మనీ స్టార్, 11వ సీడ్ కెర్బర్ వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో కెర్బర్ 6-3, 6-3తో లాటివియాకు చెందిన 12వ సీడ్  ఒస్టాపెంకాపై విజయం సాధించింది. గంట పదినిమిషాలు సాగిన మ్యాచ్‌లో కెర్బర్ మొదటి రెండు సెట్లలో ఒస్టాపెంకాపై తిరుగులేని ప్రదర్శన కనబరిచింది. కెర్బర్ షాట్లను ధీటుగా ఎదురుకొలేకపోయిన ఒస్టాపెంకా మొదటి సెట్‌ను 6-3తో ఓడిపోయింది. రెండో సెట్లో కూడా అదే దూకుడును కొనసాగించిన కెర్బర్ ఈ సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలుచుకుంది. 2016లో ఆస్ట్రేలియా ఓపెన్, యుఎస్ ఓపెన్ గెలుచుకున్న కెర్బర్ తొలిసారి వింబుల్డన్‌లో ఫైనల్‌కు చేరుకుంది. 2016 వింబుల్డన్‌లో రన్నరప్‌గా నిలిచిన కెర్బర్ ఈ సారి ఎలాగైనా టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది.  

English Title
Serena, Kerber in the final
Related News