ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెరెనా, నాదల్

serena

మెల్‌బోర్న్: టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్, నాదల్, ఆండీ ముర్రే వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే ఆస్ట్రేలియా టెన్నిస్ ఓపెన్‌లో ఆడనున్నట్లు తెలిపారు. సెరెనా బిడ్డకు జన్మనిచ్చాక ఈ ఏడాది ఆడిన యూఎస్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్‌లో పూర్తి స్థాయిలో ఆడలేక విఫలమైంది. అంతేకాకుండా యూఎస్ ఓపెన్‌లో నయోమి ఒసాకా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సెరెనా అంపైర్ పై దురుసుగా ప్రవర్తించి అందిరచేత విమర్శలు ఎదుర్కొంది. ‘ సెరెనా ప్రస్తుతం 16వ ర్యాంక్‌లో కొనసాగుతుంది. బేబీ ఒలింపియాకు జన్మనిచ్చినా తర్వాత సెరెనా ఎక్కువ ఆత్మవిశ్వాసంతో మెల్‌బోర్న్‌లో జరగబోయే ఆస్ట్రేలియా ఓపెన్‌లో అడుగుపెడుతుంది’ అని టోర్నీ నిర్వహకుడు క్రాయిగ్ టైలీ తెలిపారు. ఇక ఎవర్‌గ్రీన్ ఆటగాడు ఫెదరర్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా... అతనితో పాటు నొవాక్ జొకొవిచ్ కూడా తన సత్తా చూపేందుకు సిద్ధమయ్యాడు. మహిళల విభాగంలో కరోలిన్ డిఫెండింగ్ విజేతగా బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో మొత్తం 102 మంది మహిళలు, 101 మంది పురుషులు ఆడుతున్నట్లు నిర్వహకులు వివరించారు. ‘ డిఫెండింగ్ చాంపియన్ కరోలిన్‌కు ఇది మంచి అవకాశం. గతేడాది టైటిల్ నెగ్గిన కరోలిన్ వచ్చే నెల జరగబోయే టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చూపించబోతుంది’ అని టైలీ అన్నారు. ‘ అంతేకాకుండా మెల్‌బోర్న్‌లో ఫెదరర్‌కు మంచి రికార్డే ఉంది. ఇప్పటీకి ఆరు టైటిల్స్ తన ఖాతాలో వేసుకున్నాడు’ అని టైలీ ముగించాడు. 

Tags

సంబంధిత వార్తలు