సెర్బియా విజయానందం

Updated By ManamMon, 06/18/2018 - 01:20
SERBIA
  • కెప్టెన్ కొలరోవ్ ఏకైక గోల్ - కోస్టారికాపై 1-0తో విజయం

SERBIAసమర: తాము కొరకరాని కొయ్య అని కోస్టారికా మరోసారి నిరూపించింది. అయినప్పటికీ సెర్బియా కెప్టెన్ అలెగ్జాండర్ కొలరోవ్ 25 మీటర్ల నుంచి కొట్టిన షాట్‌కు బంతి గాలితో పోటీ పడి కోస్టారికా గోల్ బాక్స్‌లోకి దూసుకెళ్లింది. కెప్టెన్ అంటే ఎలా ఆడాలో కొలరోవ్ జట్టు సహచరులకు ఆదర్శంగా నిలిచాడు. 56వ నిమిషంలో లభించిన ఫ్రీ కిక్‌ను కొలరోవ్ గోల్‌గా మార్చడంతో ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం గ్రూప్-ఇలో జరిగిన మ్యాచ్‌లో సెర్బియా 1-0తో కోస్టారికాపై గెలిచింది. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి సెర్బియా జట్టు కోస్టారికాకు ప్రమాదకరంగా నిలిచింది. కోలరోవ్ గోల్ చేసే వరకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. గ్రూప్-ఇలో అతిపెద్ద ఫేవరెట్ బ్రెజిల్, స్విట్జర్లాండ్ ఉన్నప్పటికీ ఈ విజయం సెర్బియాకు మూడు పాయింట్లు తెచ్చిపెట్టింది. దీంతో కోస్టారికా స్థానం అనిశ్చితిగా మారింది. ఉత్సా హంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో సెర్బియా ఆటగాడు అలెగ్జాండర్ మిట్రోవిక్‌కు ఒకసారి హెడింగ్ చేసే అవకాశమొచ్చింది. తర్వాత కోస్టారికాకు చెందిన గియాన్‌కార్లో గొంజాలెజ్ రెండుసార్లు హెడింగ్‌ను గోల్‌గా మార్చడంలో విఫలమయ్యాడు. దీంతో ఎవరు గెలుస్తారని చెప్పడం కష్టంగా మారింది. సెర్బియా మిడ్‌ఫీల్డ్ ఆటగాళ్లు బంతిని తమ ఆధీనంలో తీసుకోవడంతో మాంచెస్టర్ యునైటెడ్‌కు చెందిన నెమాంజ మాటిక్, అద్భుతమైన ప్రతిభ గల సెర్జెక్ మిలింకోవిక్-సావివ్ రంగంలోకి దిగారు. లాజియో ప్లే మేకర్ సెర్బియాకు గోల్ అవకాశాలను సృష్టించే ప్రధాన బాధ్యతను తీసుకున్నాడు. అతని ప్రయత్నాలన్నిటినీ లైన్స్‌మన్ ఫ్లాగ్ వెంటాడుతున్నప్పటికీ ఫస్ట్ హాఫ్‌లో గోల్ చేయాలన్న అతని శ్రమ వృథా అయింది. వీటన్నింటినీ మర్చిపోయి ఫస్ట్ హాఫ్‌కు ముందు ఓవర్‌హెడ్ కిక్‌ను అతను గోల్‌గా మలచబోయాడు. కానీ ప్రత్యర్థి గోల్ కీపర్ కీలార్ నవాస్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. సెర్బియా ఆటగాడు మిట్రోవిక్ కోస్టారికాపై అద్భుతమైన అటాక్  తమ జట్టుకు గోల్ అందించే ప్రయత్నం చేశాడు. రెండో అర్ధ భాగం ఆరంభంలో గోల్ చేసే అద్భుత అవకాశం లభించింది. అయితే అతని గోల్ ప్రయ త్నాన్ని గోల్ కీపర్ నవాస్ అడ్డుకుని కోస్టారికాను సేవ్ చేశాడు. కానీ మరి కాసేపట్లోనే కొలరోవ్ మ్యాజిక్ చేశాడు. లభించిన ఫ్రీ కిక్‌ను కర్లింగ్ షాట్ కొట్టడంతో ఈసారి బంతి నొవాస్‌ను తప్పించుకుని గోల్ బాక్స్‌లోకి వెళ్లింది. మ్యాచ్ చివరి నిమిషాల్లో కోస్టారికా జట్టు సబ్‌స్టిట్యూట్ జోయెల్ కాంప్‌బెల్‌ను రంగంలోకి దించింది. దీంతో గోల్ చేసేందుకు కొన్ని అవ కాశాలు లభించాయి. చివరి నిమిషంలో సెర్బియా జట్టు పెనా ల్టీ స్ట్రోక్‌కు అప్పీల్ చేసింది. కానీ ఫలితం దక్కలేదు. సమయం ముగియడంతో కోస్టారికా జట్టు నిరుత్సాహంతో వెనుదిరిగింది. 

Tags
English Title
Serbian victory
Related News