భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Updated By ManamTue, 06/12/2018 - 18:35
Sensex, ends 209 points, global cues

Sensex, ends 209 points, global cuesముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా, ఉత్తరకొరియా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల మధ్య జరిగిన కీలక భేటీ సక్సెస్ కావడంతో మదుపర్లు కొనుగోళ్ల వైపు ఆసక్తి కనబర్చారు. దీంతో నేటి మార్కెట్‌ 209.05పాయింట్లు మేర లాభపడగా.. నిఫ్టీ సూచీ కూడా 56 పాయింట్లు మేర లాభపడింది. ఈ రోజు ఉదయం  40 పాయింట్ల లాభంతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు మధ్యాహ్నం ప్రాంతంలో ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఇరు దేశాధినేతల మధ్య భేటీ విజయవంతం కావడం ప్రధానంగా మార్కెట్‌ సెంటిమెంట్‌కు బాగా కలిసొచ్చింది.

దీంతో దేశీయ సూచీలు ఆద్యంతం లాభాల్లోనే దూసుకెళ్లాయి. నిఫ్టీ 10,800 వద్ద బెంచ్‌ మార్క్‌ను నిలబెట్టుకుంది. సెన్సెక్స్‌ 209.05 పాయింట్లు లాభపడి 35,692.52 వద్ద ముగిసింది. నిఫ్టీ 56 పాయింట్లు లాభపడి 10,842.85 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో లుపిన్‌, డా.రెడ్డీస్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ల్యాండ్‌ బ్యాంక్‌ షేర్లు భారీగా లాభాలను పండించాయి. భారతీ ఎయిర్‌టెల్‌, హిందాల్కో, టాటాస్టీల్‌, కోల్‌ ఇండియా షేర్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి.

English Title
Sensex ends 209 points higher on global cues
Related News