కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్: లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Updated By ManamTue, 05/15/2018 - 10:22
Sensex, Nifty, Tuesday, Karnataka election results

Sensex, Nifty, Tuesday, Karnataka election results ముంబై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఫలితాల ప్రభావం మంగళవారం దేశీయ మార్కెట్లపై కూడా పడింది. కన్నడ ఓట్ల లెక్కింపుపై మదుపర్లు దృష్టిపెట్టడంతో స్టాక్‌మార్కెట్లలో మార్పులు హెచ్చుతగ్గుదల కనిపిస్తోంది. ప్రీ ట్రేడింగ్‌లో దేశీయ సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమై అంతలోనే భారీ లాభాలబాటలో పయనించాయి. సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ కొనసాగుతోంది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 150 పాయింట్ల లాభంతో 35,707 వద్ద, నిఫ్టీ 32పాయింట్ల లాభంతో 10,839 వద్ద ప్రారంభమయ్యాయి. దాదాపు అన్ని రంగాలు ఫ్లాట్‌గానే ఉన్నాయి. ముఖ్యంగా మైనింగ్‌ షేర్లు నష్టపోతున్నాయి. ఈ రోజు ఉదయం 9.15 గంటల ప్రాంతంలో బీఎస్ఈ సెన్సెక్స్ 4 పాయింట్లు నష్టపోయి 35,552 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 10,794 వద్ద ట్రేడ్ అయింది.

ఇక పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌, టెక్‌ మహీంద్రా, గెయిల్‌,  టాటా స్టీల్‌, టైటన్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 3-1 శాతం  లాభపడుతుండగా,   టాటా మోటార్స్‌, ఇన్ఫ్రాటెల్‌, గ్రాసిమ్‌, ఐషర్‌, హెచ్‌పీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, సిప్లా నష్టాల్లో కొనసాగుతున్నాయి. కాగా, కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతుండటంతో ఒకవేళ బీజేపీ గెలిస్తే దేశీయ మార్కెట్లు కూడా లాభాల బాట పట్టే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

English Title
Sensex and Nifty on Tuesday, the day of Karnataka election results
Related News