ఆత్మగౌరవం అందని ద్రాక్షే!

Updated By ManamTue, 10/23/2018 - 03:23
mathanam

imageస్వరాష్ట్రంలో ప్రజాప్రతినిధులు హీనమైన మాటలతో దివ్యాం గుల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ వారి జీవితాలను హేళన చేస్తున్నారు. ఇటీవల కొందరు ప్రజాప్రతినిధులు ఉపయో గించిన భాష వారి అవివేకానికి నిదర్శనం. బీజేపీ నాయ కుడు దివ్యాంగులను హేళన చేస్తూ కుంటోళ్లు, గుడ్డోళ్లు అనే అవమానకర పదజాలంతో దూషించారు. అలాగే ఇటీవరు ద్ధర్మ ముఖ్యమంత్రి నిజామాబాద్ సభలో కుంటోళ్లకు, గుడ్డో ళ్లకు అనే పదజాలంతో దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని కించ పరిచేలా మాట్లాడటం వారి అహంకార స్వభావానికి నిదర్శ నం. ఇదేనా మీ పార్టీ దివ్యాంగులకిచ్చే గౌరవం. వారూ మనుషులే... వారికీ ఆత్మగౌరవం ఉంటదని గుర్తించండి. ఒకరి ఆత్మగౌరవాన్ని సడలిపోయే విధంగా ప్రభుత్వమే మాట్లాడు తుంటే ఆత్మ గౌరవ నినాదంతో తెచ్చు కున్న తెలంగాణలో దివ్యాం గుల పరిస్థితి ఎంత అధ్వా నంగా ఉందో చూడండి. ఒక ముఖ్య మంత్రే వారి పట్ల హేళనగా మాట్లాడితే అర్థం అర్థం అవుతుంది దివ్యాంగుల పట్ల వారి వైఖ రి. ఇది బలహీన వర్గాల ప్రభుత్వం ముమ్మాటికీ కాదు, అయివుంటే వారి ఆత్మగౌరవాన్ని కించపరి చేలా మాట్లాడే వారు కాదు. ఇది ఉన్న త వర్గాల ప్రభుత్వం. అందుకే కాంగ్రెస్ పార్టీ రావాలి. అందరూ ఆత్మగౌరవంతో బ్రతకాలి.

ఐక్య రాజ్య సమితి 1981ని అంతర్జాతీయ దివ్యాంగుల సంవత్సరంగా గుర్తించడం వలన మన దేశం, వివిధ ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రతేకంగా ఒక శాఖను ఏర్పా టు చేశాయి. నాటి ప్రభుత్వం వికలాంగుల అభివృద్ధి సామాజిక గిరిజన, వెనుకబడిన తరగతుల శాఖల వలే స్వతంత్య్ర శాఖ ద్వారానే వికలాంగుల అభివృద్ధి సాధ్యమని భావించి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ జీవితాలు మారుతాయని, కోటి ఆశలతో కొట్లాది తెచ్చుకున్న తెలంగాణలో ఆ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేయడం హేయమైన చర్య. ఎందుకంటే ప్రత్యేక శాఖ ద్వారా వారి అభివృద్ధి అంతంత మాత్రమే. అలాంటిది మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం అంటే వారి 3% నిధులను మళ్లించి వికలాంగుల సంక్షేమాన్ని గాలికొదిలేసింది.  గత మూడు సంవత్సరాలుగా దివ్యాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించకపోవడం... కేటాయించిన నిధులు ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోకపోవడం. గత మూడు సంవత్సరాల కాలంలో కూడా స్వయం ఉపాధి రుణాలు గాని, వివాహ ప్రోత్సాహక బహుమతులు గాని, మోటరైజ్డ్ వెహికల్స్ గాని, దివ్యాగులకు సంబంధించిన పరికరాలు గాని, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ గాని, వారి హక్కుల చట్టం- 2016ను అమలు చేయకపోవడం లాంటి ఎన్నో అవమానకర పరిణామాలు జరిగాయి. దాని ఫలితమే దివ్యాంగుల ఆత్మహత్యలు. మొన్న హైదరాబాద్‌లో మహేందర్, నిన్న వరంగల్‌లో రాగుల రామ్మోహన్, మతిస్థిమిస్థి లేని చిన్నారులను మేనమామ హత్యచేయడం లాంటి అఘాయిత్యాలు.

అయినా ఈ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరం. అందుకే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీదివ్యాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలంగాణలో వికలాంగులకు జరుగుతున్న అన్యాయాలను గమనించి అన్ని జిల్లాలు పర్యటించి, ప్రభుత్వం దివ్యాం గులకు చేస్తున్న అన్యాయాలను యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయడం జరిగింది. అప్పుడు దివ్యాంగుల సమాజానికి జరుగుతున్న అన్యాయాల మీద ప్రజల నుంచి వస్తున్న విమర్శలను, అలాగే వారి ఓటు బ్యాంకును గుర్తించిన ప్రభుత్వం మరో మోసపూరిత నిర్ణ యం తీసుకుంది. దివ్యాంగుల శాఖకు నిర్ణయాధికారం లేని చైర్మన్‌ను నియమించింది. అలాగే వారికి స్వయం ఉపాధి రుణాలు, ఉన్నత విద్య చదువుతున్నవారికి ఉచిత మోటరైజ్డ్ వెహికల్స్, లాప్‌టాప్, మొబైల్స్, వివాహ ప్రోత్సాహక బకి మతుల చెక్కులు, వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులకు ప్రక టన ఇప్పించి దరఖాస్తులు తీసుకొని, సంవత్సర కాలం గడుస్తున్నా ఇంతవరకు పోస్టులను భర్తీ చేయలేదు, రుణాలు, చెక్కులు, వెహికల్స్, లాప్‌టాప్ ఇవ్వలేదు, దివ్యాంగుల హక్కుల చట్టం - 2016ను ఇంతవరకు అమలు చేయడం లేదు. ఎన్నిసార్లు అడిగిన రేపో, మాపో అంటూ కాలం వెళ్ల దీస్తోంది. ఇంత కిరాతకంగా దివ్యాంగుల జీవితాలను బజారు పాలు చేసిన ప్రభుత్వం ఇది బంగారు తెలంగాణ అని జబ్బలు కొట్టుకుంటుంది. అన్ని వర్గాల వారిని పిలిచి ప్రగతి భవన్‌లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం దివ్యాంగుల సమాజాన్ని పిలిచి వారి సమస్యలు ఎందుకు వినదు?తమ సమస్యలపై వారెన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. వికలాంగుల హక్కుల చట్టం - 2016 బిల్లును పార్లమెంట్లో పాస్ కావడానికి తానే కృషి చేశానని నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత వికలాంగుల హక్కుల చట్టం - 2016 తెలుగు అనువాద పుస్తకంలో ప్రచురించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల హక్కుల చట్టం - 2016ను అమలు చేయించే అధికారం మీ చేతిలో ఉన్న అమలు చేయించలేకపోతున్నారు. మ్యాని పెస్టోలో దివ్యాంగులను సకలాంగులు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అంటిరి. ఏమైంది ప్రభుత్వ ఉద్యోగం? భూ పంపిణీలో వికలాంగులకు మూడెకరాల భూమి ఏమైంది. వికలాంగుల అంత్యోదయ రేషన్ కార్డులు ఏమయ్యాయి. నిజంగా దివ్యాంగుల సమాజం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందుగా సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరుచేసి ప్రత్యేక కొనసాగించాలి. అలాగే దివ్యాంగుల హక్కుల చట్టం - 2016 ను వెంటనే అమలు చేయాలి. దివ్యాంగుల రోస్టర్ పాయింట్  56 నుంచి 10 తగ్గించాలి. అలాగే బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలి, దివ్యాంగులకు బ్యాంకులతో సంబంధం లేకుండా స్వయం ఉపాధి రుణాలు అందించాలి. దరఖాస్తు తీసుకున్న మోటరైజ్డ్ వెహికల్స్, లాప్‌టాప్, 4 మొబైల్స్, వివాహ ప్రోత్సాహక బహుమతుల చెక్కులను వెంటనే అందించాలి. 

ఏ ప్రభుత్వమైనా అణగారిన వర్గాల కోసం పనిచేయాలి. కొంతమేరకైనా అభివృద్ధి చేయాలి. ఈ ప్రభుత్వం దివ్యాంగుల కడుపు కొట్టి ఉన్నత వర్గాలను, కార్పొరేట్ సంస్థ లను బతికిస్తోంది. దివ్యాంగుల 3% నిధులు ఇతర పథకాలకు మళ్లిస్తున్నారు. మా నిధులు మా సంక్షేమం కోసమే ఖర్చు చేయాలి. దానికై దివ్యాంగుల సబ్ ప్లాన్ చట్టం తేవాలి. అలాగే దివ్యాంగుల సంక్షేమం మీద అల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి, తెరాస ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల సమాజానికి జరిగిన అన్యాయం మీద, దివ్యాం గుల ఆత్మహత్యపై, అలాగే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించుట గురించి నిర్ణయం తీసుకోవాలి. అన్ని వర్గాలకు రాజకీయ రిజర్వేషన్ ఉన్నందుకే అభివృద్ధిలోకి వస్తున్నాయి. చట్ట సభలలో సరైన  ప్రాతినిధ్యం లేక, విధాన నిర్ణయాలలో భాగస్వామ్యం కానందునే దివ్యాంగుల వర్గం వెనుకబడి ఉంది.

- వీరన్న నాయక్ ఆంగోత్

English Title
self respect
Related News