స్వయంపాలనతోనే అస్తిత్వ సంరక్షణ

Updated By ManamMon, 10/15/2018 - 03:42
Adivasi

గతంలో  చేసిన తప్పిదాలను పునం సమీక్షించుకొని ఆదివాసీల నిజమైన స్వయం పాలనా కొరకు చిత్తశుద్ధితో కాగిత రూపం నుంచి వాస్తవ కార్యా చరణ రూపంలోకి వచ్చేలా పనిచేసి మెరుగైన అదివాసి స్వయంపాలన సమాజ నిర్మాణం కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజ్యంగ కమిషన్ ఎలా ఉంటుందో గ్రామసభ పరి ధిలో గ్రామసభకు ఎన్నుకోబడిన కమిటీ కూడా అదే విధంగా పనిచేస్తుంది, ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను సంరక్షిస్తూ స్వయంపాలనను ఆచరణ రూపంలో చేసిన కార్యక్రమం పెసా చట్టం అమలు చేయడం ద్వారా మాత్రమే జరుగుతుంది.

Adivasiసమాజంలో ఒక కుటుంబంలో వారికి సంబంధించి తీసు కునే నిర్ణయాలు, చేసే పనులు వారి కుటుంబ పెద్దల ఆలోచనలు, కట్టుబాట్లు, నిర్ణయాలపైన వారికి గల అవగా హనతో ఆ కుటుంబంలో పాలన సాగుతుంది అంటే అది ఆ కుటుంబ స్వయంపాలన, కుటుంబంలో బయటకి వచ్చిన నాటి నుంచి సమాజంలో విషయాలు వారిపైన ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం చూపే నిర్ణయాలను వారి ప్రమేయం లేకుండానే సమాజం తీసుకుంటుంది. ఈ సమాజంలో ముఖ్యంగా ప్రభుత్వం, అధికారులు, న్యాయ వ్యవస్థ ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించి ఒకసారి పరిశీలిస్తే భారతదేశానికి 1947కి పూర్వం.. 1874 షెడ్యూల్ జిల్లాల చట్టం, 1919 చట్టం ఆ తర్వాత సైమన్ కమిషన్ నివేదిక ద్వార వచ్చిన భారత ప్రభుత్వ చట్టం 1935లోని సెక్షన్ 91, 92 చట్ట సభలు చేసే చట్టాలు అమలు జరగవని  అవసర మైన మార్పులు చేర్పులు గవర్నర్ చేసి ప్రకటించిన పిదపనే అమలు జరుగుతాయని చెప్పడం జరిగింది. అంతే కాకుం డా ఆదివాసిలకు సంబంధించి పన్నులు వసూలుచేసే ప్రక్రియకూ పూర్తి మినహాయింపులు ఇస్తూ ఈ దేశం వారిది, ఈ ప్రాంతం వారిది వారి నుంచి పన్నులు వసూలు చేయడం చట్ట సమ్మతం కాదని పేర్కొంది. బ్రిటిష్ పరిపాలనకు, పరిపాలన అనంతరం కూడా ఆదివాసీలు  ప్రత్యేకమైన సంస్కృతి సంప్రదాయాలతో కూడిన వివాదాల పరిష్కార వేదిక ఆదివాసి గ్రామాలలో ఉండేది, అంతేకాకుండా స్వతంత్య్రానంతరం వచ్చిన మార్పులలో భాగంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగంలో కానీ, వాటిని అమలు గురించి కృషిచేస్తున్న పాలకులు, అధికారులు తీసుకున్న చర్యలు 1947 నుంచి 1997 మధ్య గల ఐదు దశాబ్దాల కాలంలో ఆదివాసీలను అభివృద్ధి వైపు తీసుకెళ్ళకుండా వారి జీవితాన్ని, ఆచారాలు, సంప్రదాయాలు, కనుమరుగయ్యేలా చేస్తూ వారి ప్రాంతంలో గల వనరులను వారి సమ్మతం లేకుండానే కనుమరుగు చేస్తున్నాయి.

ఇలాంటి క్రమంలో దేశవ్యాప్తంగా ఆదివాసీలు వారి జీవితాన్ని, ఆచారాలు, సంప్రదాయాలు, మనుగడనూ దృష్టి లో పెట్టుకొని మా ఊరిలో మా రాజ్యం పేరిట ఆందోళనలు చేయడం జరిగింది. ఆదివాసీల పోరాటాన్ని గుర్తించి నాటి భారతదేశ ప్రభుత్వం 1995లో దిలీప్సింగ్ భురియా కమి టీని ఏర్పాటు చేసి, ఒక పరిష్కార మార్గాన్ని చూపించాలని ఏర్పాటు చేయడమైనది. ఈ క్రమంలో 1995లో దిలీప్సింగ్ భురియా కమిటీ, ఆదివాసి వ్యవస్థకు సంబం ధించి ప్రత్యేకమైన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించారు. ఆ  నివేదికను పరిశీలిస్తే ముఖ్యంగా  ఆదివాసీల ఆచారాలలో ప్రత్యేకమైన ప్రముఖ స్థానం గ్రామసభ ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా భూమిపైన, నీటి పైనా, ఆరోగ్య, సమస్త విష యాలపై నిర్ణయాధికారాలు గ్రామసభకు ఉంటాయని, వాటిని పార్లమెంట్ నివేదిక సమర్పించారు. అంతేకా కుండా 5, 6వ షెడ్యూల్లో లేని ఆదివాసీలు ఉన్న ప్రాంతాలను కూడా పరిష్కారం చూపాలని, మిగి లిన ప్రాంతాలను 5, 6వ  షెడ్యూల్ ప్రాంతాల్లో చేర్చాలని నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆదివాసీయుల చారి త్రక పోరాటాలు, అన్యాయం, అక్రమాలు, నిరంతర దోపి డీకి వ్యతిరేకంగా ఆదివాసియుల సుదీర్ఘ పోరాట ఫలితంగా దిలీప్ సింగ్ భురియా కమిటీ సమర్పించిన నివేదిక ఆధా రంగా రూపొందించిన చట్టం - పెసా చట్ట రూపంలో 1996 డిసెంబర్‌లో  ఆమోద ముద్ర వేశారు. ఈ చట్టంలో పేర్కొన్న గ్రామసభకు రాజ్యంగా బద్ధంగా ఏర్పడిన కమి షన్‌లకు, చట్ట సభలకు ఏ విధమైన అధికారాలను కలిగి ఉన్నాయో అదే విధమైన అధికారాలను గ్రామసభ వాటి పరిదిలో ఉన్నటువంటి వాటిపైన కల్గి వుంటుంది. ఈ యొక్క ఆమోదం పొందినటువంటి చట్టాన్ని ఇది రాజ్యాంగ నిబంధనలు 244 లోని క్లాజు 1లో పేర్కొన్న వాటికీ వర్తిస్తుందని అదే విధంగా ఈ చట్టఫలితాలనూ పంచాయతీలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టాలను ఈ పెసా చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఒక సంవత్సరం లోపల అంటే 1997 డిసెంబర్ 24 నాటికి సవరించాల్సి ఉందని చెప్పడం జరిగింది. పార్లమెంట్‌లో ఆమోదం పొందిన చట్టంలోని సెక్షన్ 4-్చ ప్రకారము ఆదివాసీ ప్రాంతాల్లో పంచాయతీకి సంబం దించిన ఏ చట్టం అయినా అక్కడి సంప్రదాయ చట్టానికి (కస్టమరి లా), సాంఘిక మత సంబంధమైన ఆచారాలకు, గ్రామంలో నిర్వహణకు సంబంధించి ఎప్పటినుండో అక్కడ అమల్లో ఉన్న సంప్రదాయమైన ఆచారాలకు అనుగుణంగా ఉండాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గ్రామసభ, గ్రామపంచాయతీ, మండల ప్రజాపరిషత్, జిల్లా స్థాయి పం చాయతీలకు ఈ చట్టంలో పేర్కొనడబడిన అంశాలకు సం బంధించిన అధికారాలు వివిధ రూపంలో అప్పగించడం జరిగింది. ఈ గ్రామసభలో పంచాయతీ ఓటరు జాబితాలో పేర్లున్న వ్యక్తులు అందరూ సభ్యులుగా ఉంటారని ఇలా ఉండటం వల్ల ఆయా గ్రామసభలో సభ్యులు ఉన్నటువంటి సభ అంతా కూడా ఆదర్శంగా ఉంటుందన్న భావనను ఆది వాసీల ఐక్యత, కట్టుబాట్లను తెలిపే విధంగా  కమిటీ పేర్కొనడం జరిగినది.

మొదటిసారిగా ఆదివాసీల  సంప్రదాయాలకు విలువ నిస్తూ, సంస్కృతిని పరి రక్షిస్తూ, వారి ఆచార వ్యవహారాలను చట్ట రూపంలో చేసిన కార్య క్రమం పేసా చట్టం అమలు జరగడం ద్వారా మాత్రమే సాధ్యమౌతుందని పే ర్కొన్నారు. పెసా గ్రామ సభలు బలోపేతం చేసే దిశగా వివిధ అంశాలను పేర్కొనడం జరిగింది. ముఖ్యం గా స్థానిక ఆచార సంప్రదాయాలు స్థానిక ప్రజల సాంస్కృతిక గుర్తింపు, పరిరక్షణ, అలాగే స్థానిక వివాదాలను అక్కడి సంప్రదాయబద్ధమైన పద్ధతి ద్వారా పరిష్కరించుకునేలా చేయడం, గ్రామ పంచాయతీ  సామాజిక, ఆర్థిక, అభివృద్ధి కోసం అవసరమైన ప్రణాళికలు కార్య క్రమాలు గ్రామసభ ఆమోదింపజేయాలని, అదే విధంగా ఇతర పథకాల లబ్ధిదారుల గుర్తింపు, ఎంపిక ప్రక్రియ గ్రామసభ చేపట్టాలని పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు, ఇతర పథకాల కింద సామాజిక, ఆర్ధిక, అభివృద్ధి ప్రాజెక్టుల కార్యక్రమాల విషయంలో నిధుల విని యోగానికి సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్ గ్రామసభ నుంచి తప్పనిసరిగా పొందాలని పేర్కొనడం జరిగింది. ఇక పెసా చట్టంలో మధ్యపాన నిషేధం అమలు లేదా వినియోగ క్రమబద్దీకరణ లేదా అమ్మకాలపై ఆంక్షలు విధించడం, చిన్న తరహా అటవీ ఉత్పత్తులు, వనరులు, గిరిజనుల  భూమి అన్యాక్రాంతం కాకుండా చూడటము, వివాదంలో ఉన్నటువంటి భూమిని పరిష్కరించి తిరిగి గిరిజనులకు  అప్పగించడం గ్రామ సంతల నిర్వహణ, గిరిజనులతో చేసే వడ్డీ వ్యాపారంపై నియంత్రణ అధికారం, గిరిజనుల ఉప ప్రణాళిక నిధులుతో సహా అన్ని స్థానిక ప్రణాళిక వనరుల పైన  అధికారం, సామాజిక రంగంలో పనిచేసే సంస్థల పని తీరుపై నియంత్రణ అధికారాలను గ్రామ సభలకు  ఇవ్వడం తో పాటు స్వీయ నిర్వహణ అధికారంఇవ్వడము  జరిగింది. 1996లో చేసినటు వంటి కేంద్ర పెసా చట్టంను రాష్ట్రాల వారిగా కేంద్ర పెసా చట్టానికి లోబడి సవరణలు చేయాల్సి ఉంది కానీ అప్పటికే రాష్ట్రంలో ఔఖీఖ 1/70 చట్టానికి సవ రణలు, గిరిజన ప్రాంతాల వనరుల దోపిడీపై పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రణాళికలు చేసి రాజ్యాంగ విరుద్ధంగా అమలు చేయడము జరుగుతున్నది, వీటిపై అప్పటి గవర్నర్, అధికా రులు, గిరిజన ప్రజా ప్రతినిధులు మౌనంగా ఉండి, గిరిజన వ్యతిరేక నిర్ణయాలు అమలు జరుగుతున్న సమయంలో స్థానిక ఆదివాసీ సంఘాలు, స్వచ్చంద సంస్థలు గిరిజను లకు జరిగిన అన్యాయాలపైన న్యాయం కోసం సుప్రీం కోర్టు వారిని ఆశ్రయించడం జరిగినది.

అప్పుడు సుప్రీంకోర్టు వారు షెడ్యూల్ ప్రాంతంలో ప్రభుత్వం కూడా గిరిజనే తరుడుగానే ఉంటుంది అని తేల్చి చెప్పింది. న్యాయ స్థానాలు తీర్పులు వెలువరించే వరకు ప్రభుత్వాలు అధికా రులు గిరిజన వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారంటే గిరిజనుల సంస్కృతి - సంప్రదాయాలను, ఆచార వ్యవహా రాలు, గిరిజనుల అభివృద్ధిపై ప్రభుత్వానికి అధికారానికి గల చిత్తశుద్ధి ఏమాత్రం ఉందో తేటతెల్లం అవుతున్నది. కోర్ట్ తీర్పు ప్రకారం 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర పెస చట్టాన్ని రాష్ట్రానికి అనుగుణంగా సవ రిస్తూ చట్టం చేశారు. ఈ చట్టాన్ని పంచాయతీ రాజ్ చట్టంలోని భాగం 6అ (242అ-ఐ వరకు)లోని చొప్పించారు. ఈ చట్టంలో ముఖ్యంగా షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు, గ్రామ పంచాయితి, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్‌లకు వర్తిస్తుందని, గ్రామ సభ విధులను, గ్రామ, మండల స్థాయి రిజర్వేషన్లు, మండల స్థాయిలో ప్రాతినిధ్యం లేని గిరిజన తెగలకు సం బంధించిన వ్యక్తులను నామినేట్ చేయడం, భూ సేకరణ, చిన్న తరహ ఖనిజాలకు సంబంధించి విధి విధానాలతో పాటు గ్రామసభ, గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్‌లకు వివిధ అంశాలపైన అధికారం ఇచ్చారు. 1998 లో చేసిన పెసా చట్టం ద్వారా వచ్చిన మార్పులు ఏమిటి? అది ఏ విధంగా అమలు జరుగుతుందని మనం ఒక్కసారి పరిశీలిస్తే 1998లో చట్టం చేసినప్పటికీ అమలుకు సంబంధించి షెడ్యూల్డ్ ప్రాంతాలకు ప్రత్యేకంగా ఉన్న గవర్నర్ గాని, మరియు ఏజెంటు టు గవర్నమెంట్‌గా ఉన్న జిల్లా కలెక్టర్‌గాని, అదేవిధంగా అడిషనల్ ఏజెంటు టు గవర్నమెంట్‌గా ఉన్న ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్లుగా గాని, ఇతర ప్రభుత్వ అధికారులు కానీ, రాజ్యాంగబద్ధంగా గిరి జన సంక్షేమం ఉన్నటు వంటి గిరిజన సలహా మండలి గాని, ప్రజాప్రతినిధులు ఈ చట్టం అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వాలకూ గురుధర బాధ్యతనూ గుర్తు చేయలేదు. అక్రమంలో న్యాయస్థానాలు  కూడా ఎన్నో విషయాలపై సుమోటోగా స్పందించినప్ప టికీ, పేసా చట్టం అమలు జరుగని విషయంలో మౌనం దాల్చడంతో ఆదివాసీల నిత్య జీవన సమస్యలు అయిన భూమి పరాయికరణ, సంస్కృతి, సంప్రదాయలు విచ్చిన్నం, వడ్డీ వ్యాపార సమస్యలు, సహజ వనరుల దోపిడీ యథావిధిగా కొనసాగింది. ఇలాంటి క్రమంలో కాగిత రూపంలో ఉన్న చట్టానికి కార్యరూపం వచ్చేవిధంగా ఆదివాసీల హక్కులు బాధ్యతలను గుర్తెరిగి స్వయంపాలన కొరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉద్యమం చేశారు. ఈ ఉద్యమ తీవ్రతను పరిశీలించి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను, చట్టం అమలులో గల అలసత్వాన్ని ఆదివాసీలు గుర్తించా రని గ్రహించి వారిలో గల ఆగ్రహజ్వలను చల్లార్చడానికి పెసా చట్టానికి రూల్స్‌గా జీవో నెంబర్ 66ను 24-మార్చి-2011న విడుదల చేశారు. పెసా చట్టం అమలు కు సంబంధించిన నిబంధనలు రూపొందించడానికి 13 ఏళ్లు చేసిన అలస్యాన్ని, నిబంధనలు రూపొందించిన తర్వాత అమలు చేయడానికి కూడా అదేవిధమైన జాప్యాన్ని ప్రభుత్వం, అధికారులు కొనసాగిస్తూనే ఉన్నారు. 2011లో నిబంధనలు చేసినప్పటికీ అవి కాగితం రూపంలో ఉన్నాయి తప్ప కార్యాచరణలో ఏమాత్రం లేవు.

ఇలాంటి క్రమంలో స్థానిక ఆదివాసీ సంఘాలు మరో మారు  పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళన చేయడంతో ప్రభు త్వ అధికారులలో చలనం కలిగి 2013-2014 కాలంలో గ్రామసభలు ఏర్పాటు వాటికి ఉపాధ్యక్షులు, కార్యదర్శులు ఎన్నికయ్యే విధంగా తగు చర్యలు తీసుకున్నది. ఈ పెసా గ్రామసభలకు సంబంధించి ఉపాధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక అనేది కొన్ని కొన్ని గ్రామాలకు మొక్కుబడిగా ఏర్పాటు చేసి మొత్తం షెడ్యూల్డ్ ప్రాంతంలో గల గ్రామసభల అన్నిటికి ఎన్నిక జరగకుండా అసంపూర్తిగానే నిలిచిపోయింది. అంతే కాకుండా ఎన్నికైన అటువంటి గ్రామసభ ఉపాధ్యక్షులు, కార్యదర్శికి ఈ చట్టం పైపూర్తి అవగాహన కల్పించకుండ ఉండడం వలన ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఆదివాసిలను వారి స్వయం పరిపాలన అవకాశాన్ని వారికి దూరం చేయడం జరిగింది. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు కానీ, ప్రజా ప్రతినిధులు కాని ఆదివాసీల పక్షాన ప్రశ్నించకుండా  మౌనంగా ఉండిపోవడంతో అదివాసిలను ఇంకా దుర్భర జీవితంలోకి నేట్టేవేయబడ్డారు. నూతన తెలంగాణా రాష్ట్రంలో అయినా అదివాసీల జీవితాలలో మార్పు వస్తుంది అని ఆదివాసీలు ఆశించి నారు, కాని తెలంగాణ రాష్ట్రం పంచాయతీ రాజ్ చట్టంలోని పెసా చట్టం ప్రకారం (242అ-క్లాజ్2)లో పేర్కొన్న ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు వారిని సంరక్షించే విధంగా పంచాయతీ చట్టాలు ఉండాలని పేర్కొన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన నూతన జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటులో పైన తెలిపిన పేసా చట్టంలోని 242అ-క్లాజ్2 ను పూర్తిగా విస్మరించి రాజ్యంగబద్దముగా ఏర్పాటు అయిన పేసా గ్రామసభల అధికారాలకు విరుద్ధముగా నూతన జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయితీల ఏర్పాటు చేయడం జరిగింది. 

ఆనాడు దిలీప్ సింగ్ భూరియా కమిటీ ఏదైతే చెప్పిం దో గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్‌లలో ఆదివాసీల ప్రాతినిధ్యం ఉంటే ఆది వాసీల యొక్క  సంస్కృతి సాంప్రదాయాలు మరింత రక్షిం చబడి మరిన్ని చర్యలు తీసుకోవడంతోపాటు వారు దోపిడీకి  గురికాకుండా ఉంటారని భావించి నివేదికను కేంద్రానికి సమర్పించిది, పేసా చట్టము ఏర్పాటు అవడములో కమిటి నివేదిక కీలకంగా మారినది, కాని నివేదికలో పేర్కొన్నటు వంటి కీలక అంశాలను విస్మరించి, కొన్ని అంశాలతో చట్టా లను చేసి గ్రామ సభకు అధికారాలు ఇచ్చిన, ఆ అధికా రాలు అమలు జరగకుండా ఉండడానికి చేయాల్సిన జాప్య ము చేస్తూనే నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రజసౌమ్య భారతములో ఉన్నటువంటి లోక్‌సభ, శాస నసభల మాదిరిగానే పెసా గ్రామ సభ పనిచేయాల్సిన తరు ణంలో ప్రభుత్వం, అధికారులు, న్యాయ సహకార సం స్థలు, ప్రజా సంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీలు అం దరు కూడా అధికశాతం నిరక్షరాస్యులైన ఆదివాసీలకు పెసా చట్టం ద్వారా సంక్రమించిన విషయాలను తెలుపుతూ,  73వ రాజ్యంగ సవరణ ద్వార 5వ షెడ్యూల్ ఔన్నత్యాన్ని కాపాడే విధంగా రాజ్యంగ బద్ధంగా ఏర్పాటు అయిన గ్రామసభలు బలోపేతం అయ్యేలా, కేంద్ర ప్రభుత్వం - ప్రపంచ దేశాల మెప్పుకోసం కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాలు -  కేంద్ర ప్రభుత్వ కితాబు కోసం కాగితాలలో అభివృద్ధి నివేదికలు కాకుండా, కార్యరూపంలో చరిత్ర గర్వపడేలా ప్రస్తుత ప్రభుత్వాలు గతంలో  చేసిన తప్పిదాలను పునం సమీక్షించుకొని ఆదివాసీల నిజమైన స్వయం పాలనా కొరకు చిత్తశుద్ధితో కాగిత రూపం నుంచి వాస్తవ కార్యా చరణ రూపంలోకి వచ్చేలా పనిచేసి మెరుగైన అదివాసి స్వయంపాలన సమాజ నిర్మాణం కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని యెడల ప్రభుత్వము తీసు కునే ఆదివాసీల వ్యతిరేక నిర్ణయాల వలన దేశ చరిత్రలో ఆదివాసీలు ఒక చరిత్రగానే మిగిలిపోతారన్నది నగ్న సత్యం. రాజ్యంగ కమిషన్ ఎలా ఉంటుందో గ్రామసభ పరి ధిలో గ్రామసభకు ఎన్నుకోబడిన కమిటీ కూడా అదే విధం గా పనిచేస్తుంది, ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను సంరక్షిస్తూ స్వయంపాలనను ఆచరణ రూపంలో చేసిన కార్యక్రమం పెసా చట్టం అమలు చేయడం ద్వారా మాత్రమే జరుగుతుంది.
 కొమరం అనిల్ కుమార్
9948700476

Tags
English Title
Self-preservation of existence
Related News