సెలక్షన్ కమిటీ తప్పులకు... సౌరభ్ బలి

Updated By ManamFri, 09/21/2018 - 23:47
jaspal
  • జూనియర్ షూటింగ్ కోచ్ జస్పాల్ రాణా

jaspalfన్యూఢిల్లీ: నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) సెలక్షన్ కమిటీ తప్పులకు యువ షూటర్ సౌరభ్ చౌదరి ఏడాది పాటు జాతీయ జట్టుకు దూరమయ్యాడు అని జూనియర్ షూటింగ్ కోచ్ జస్పాల్ రాణా శుక్రవారం తెలిపారు. మీరట్‌లోని కలినా గ్రామంలో ఒక రైతు కుటుంబానికి చెందిన సౌరభ్ చౌదరి ఇటీవల పాలెంబాంగ్‌లో జరిగిన ఆసియా గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన యువ షూటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ‘ ఎన్‌ఆర్‌ఏఐ సెలక్షన్ కమిటీలో తప్పుల వలన సౌరభ్ సంవత్సరం పాటు జాతీయ జట్టుకు దూరమ య్యాడు’ అని కోచ్ చెప్పాడు. ‘ సౌరభ్ నెంబర్‌వన్ షూటర్. చౌదరికి ఎన్జీవో మద్దతు ఉంది. కొన్ని గ్రిప్ సమస్యలు వలన సౌరభ్ ట్రయల్స్‌లో అర్హత సాధించలేకపోయాడు అని సెలక్షన్‌లో ఒక వ్యక్తి తెలిపాడు. చౌదరి విషయాన్ని కొంతమంది కోచ్‌లతో చెప్పాను’ అని ఆసియా గేమ్స్‌లో నాలుగు సార్లు బంగారు పతకాలు సాధించిన జస్పాల్ రాణా వివరించాడు. ఆసియా గేమ్స్‌కు ముందు సౌరభ్ ట్రయల్ స్కోర్ జీతూ కంటే ఎక్కువగా ఉంది. ‘ టాప్ ప్లేస్‌లో ఉండటం అనేది చాలా కష్టం. ఓట ములు ఎలా అధిగమించాలి అనేది యువ షూటర్లు నేర్చుకోవాలి. జీవితం అన్ని పాఠాలను నేర్పుతుంది’ అని రాణా ముగించాడు.

Tags
English Title
The selection committee is making mistakes ... Saurabh Bali
Related News