‘సవ్యసాచి’ నుంచి రెండో పాట విడుదల

Updated By ManamTue, 10/16/2018 - 11:35
savyasachi

savyasachiనాగచైతన్య హీరోగా చందూమొండేటి తెరకెక్కించిన చిత్రం ‘సవ్యసాచి’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి రెండో పాట విడుదలైంది. కుర్రాడి ఎడమచేయి అతడికి సహకరించకుండా, చేసే ప్రతి పనిలోనూ అడ్డుపడుతుంటే, జీవితం ఏమైపోతుందో అని, అతడి తల్లి పడే బాధను ఈ పాటలో వివరించారు.

ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. శ్రీనిధి తిరుమల ఆలపించారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ పాట వినసొంపుగా ఉంది. ఇక ఈ చిత్రంలో నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ నటించగా.. భూమిక, మాధవన్ కీలక పాత్రలలో కనిపించనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

English Title
Second song release from Savyasachi
Related News