సైన్స్ సర్వం ఎరుగదు, మతానికి అసలేమీ తెలియదు!

Updated By ManamFri, 08/10/2018 - 01:46
Science

imageసైన్సు ఒక్కటే సైన్సును సమర్థిస్తుంది. అవసరమైతే విభేదిస్తుంది. తప్పిదం జరి గితే ఒప్పుకుంటుంది. సరి దిద్దుకుంటుంది. ఈ చర్య నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మతానికి అసౌ కర్యం లేదా సౌలభ్యం లే దు. అది ఎదుటివారిని చం పి తన ఆధిపత్యాన్ని నిలబె ట్టుకుంటుంది. గతమైనా, వర్తమానమైనా మనకీ విషయం స్పష్టం చేస్తుంది. సత్యం తనని నమ్మమని ఎవరినీ ప్రాధేయపడదు, ప్రార్థించదు. ఆ అవసరం మతాలకుంది. సైన్సుకు లేదు. ఉదాహరణకు శాస్త్ర వేత్తలంతా శని, ఆదివారాల్లో ఒకచోట సమావేశమై ఎప్పు డూ పాటలు పాడలేదు. వాళ్ళకు ఆ అవసరమే లేదు. సత్యం-దానికదే ఆవిష్కరింపబడుతుంది. దానికదే నిలబడు తుంది. మత విశ్వాసాలున్నవారికి అసత్యాల్ని, భ్రమల్ని, కల్పనల్ని నమ్మే ప్రయత్నంలో సెల్ఫ్ మెస్మరిజం, సెల్ఫ్ మో టివేషన్ అవసరం! అందువల్ల ప్రార్థనలు, కీర్తనలు, ధ్యా నాలు, పూజలు, సమాధిలోకి పోవడాలు, శ్వాసమీద ధ్యాస పెట్టడాలు వగైరా అవసరమౌతాయి. ఇవి లక్షల సంవత్స రాలుగా, మిలియన్ల మంది ఆచరిస్తున్నా.. అసత్యం- సత్యం గా మారలేదు. భ్రమ-వాస్తవం కాలేదు. లేని దేవుడు ఎక్క డా ఎవరికీ కనిపించలేదు. ఆగామి కాలాలలో కూడా ఇది ఇలాగే ఉంటుంది. అసత్యాన్ని సత్యంగా మార్చడం ఏ మతం వల్లా కాలేదు- కాదు’, సత్యాన్ని ఎప్పుడూ దివిటీలా ఎత్తిపట్టేదే సైన్సు గనుక, అసత్యాలు దానికి సుదూరంలోనే ఉంటాయి.  

   సైన్సు గురించి చెప్పుకోవాల్సిన మంచి విషయ మేమంటే ఎవరూ నమ్మినా నమ్మకపోయినా దాని అస్తిత్వం దానికిimage ఉంటుంది. అది కూడా వాస్తవంలో, సత్యంలో ఒక భాగంగా ఉంటుంది. మతం పరిస్థితి దీనికి భిన్నం. జనం నమ్మితేనే దాని అస్తిత్వం ఉంటుంది. జనం నమ్మకపోతే అది ఉండదు. అందువల్ల ఎక్కువమందిని తన పరిధిలోకి లాక్కో వడానికి అది నిరంతరం ప్రచారం చేసుకుంటూ ఉంటుంది. వీలయితే ఆశ చూపిస్తుంది. వీలు కాకపోతే, పీకనొక్కేస్తుంది. వైజ్ఞానిక చరిత్రలో ఎప్పుడూ, ఎక్కడా అలాంటి సంఘట నలు లేవు. మనుషుల్ని విడదీయకుండా అందరికీ మేలు చేసేది సైన్సు. మేలు జరుగుతుందని మాయమాటలు చెపు తూ జనాన్ని విడగొట్టేది మతం. సైన్సుకు సరిహద్దులే లేవు. కొత్త ఆలోచనలతో నిరంతరం తనని తాను మార్చుకుంటూ, ప్రపంచాన్ని మార్చుకుంటూ పురోగమనంలోకి దూసుకెళ్లేది సైన్సు. మతం మారదు. మారనివ్వదు. దానిదెప్పుడూ తిరో గమనమే పురోగమనమనుకునే పరిస్థితిః జ్ఞానం పేరుతో విస్తరించిన ‘మూఢత్వం’ సమాజానికి ప్రమాద హేతువ యింది తప్ప-నిరక్షరాస్యత, అమాయకత్వం, అజా ్ఞనం సమాజాన్ని ఎప్పుడూ దెబ్బతీయలేదు. అందుకే సమా జంలోని నిరక్షరాస్యత, అమాయకత్వం, అజ్ఞానం తగ్గించ డానికి, మూఢత్వాన్ని ఛేదించడానికి వైజ్ఞానిక స్పృహ అవసర మౌతుంది! అవసరమౌతూనే ఉంటుంది. 

ఇది ఇలా ఉంచితే శాస్త్ర సాంకేతిక, వైజ్ఞానిక రంగాలలో పనిచేసే వారంతా హేతువాదులు కారు. ఉద్యోగాన్ని ఉద్యో గంగా చేస్తూ, వ్యక్తిగతమైన తమ మూఢనమ్మకాల్ని నమ్మ కంగా కాపాడుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఉండడమే కాదు, సామాన్యుల్ని కూడా అయోమయంలో పడదోస్తున్నారు. అన్నీ తెలిసిన వైజ్ఞానికులకే ఇలాంటి బలహీనతలుంటే మన కెందుకు ఉండకూడదూ? అని కొందరు సామాన్యులు భావి స్తూ ఉంటారు. నిజానికి, శాస్త్ర సాంకేతిక, వైజ్ఞానిక రంగా లకు సంబంధంలేని ఎంతోమంది సామాన్యులు కూడా తమ ఇంగిత జ్ఞానాన్ని నిద్రలేపి, హేతువాదులవుతున్నారు. టూకీ గా చెప్పేదేమంటే చదువకు, డిగ్రీలకు, హోదాలకు, పదవులకు వైజ్ఞానిక స్పృహకు సంబంధం ఉండాలని మనం అను కుంటూ ఉంటాం. కానీ, నిజానికి ఉండడం లేదు - గొప్ప చదువులు చదివినవారు, ఉన్నత పదవుల్లో ఉన్నవారు కూడా, మూఢనమ్మకాల మురికిలో మునిగితేలేవారున్నారు. అందుకు భిన్నంగా చదువు, హోదాలేని అతి సామాన్య జీవు లు కూడా వైజ్ఞానిక స్పృహతో హేతువాదులుగా మారిన వారు, మారుతున్నవారు ఉన్నారు. పెద్ద చదువు-హోదా ఉన్నవారందరూ సామాన్యులకు ఆదర్శప్రాయంగా ఉండలేక పోవడం విచారకరం. చదువు హోదా లేక పోయినా సమా జగతిని ఆరోగ్యవంతమైన హేతువాదం వైపు మళ్ళించే సామాన్యులు కూడా కొందరుండడం ఆనందించదగ్గ అంశం. 

ఇక్కడ శాస్త్రవేత్తల్లో మత విశ్వాసాలు ఎలా ఉన్నాయన్న ది పరిశీలిద్దాం. కొన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ప్రక టించిన వివరాల్ని విశ్లేషించుకుందాం. దేవుణ్ణి నమ్మే భారత శాస్త్రవేత్తలు 27 శాతం అయతే యునైటెడ్ కింగ్‌డమ్‌లో 11 శాతం మాత్రమే. ఏదో ఒక శక్తి ఉంది అని నమ్మే భారత శాస్త్రజ్ఞులు 38 శాతమైతే యు.కె.లో 8 శాతమే. భారతీయ వైజ్ఞానికుల్లో 83 శాతం సెక్యులరిజంపై నమ్మకమున్నవారు. అదే యు.కె.లో మత సామరస్యం ఉన్నవారు 93 శాతం. 

ఎలెన్ హవార్డ్ ఎక్లాండ్ ఆఫ్ రైస్ యూనివర్సిటీ వారు భారత దేశానికి బ్రిటన్‌కు పోలిక చూపెట్టారు. మత విశ్వా సాలు లేని శాస్త్రవేత్తలు ఇండియాలో 6 శాతమైతే, యు.కె.లో 65శాతం మంది ఉన్నారు. మత సంబంధమైన కార్యక్రమా లకు హాజరయ్యే శాస్త్రజ్ఞులు ఇండియాలో 32 శాతం ఉంటే యు.కె.లో 12 శాతమే ఉన్నారు. మత సంబంధమైన కార్య క్రమాలకు అసలు వెళ్లకుండా ఉండే భారత శాస్త్రజ్ఞులు 19 శాతమైతే యు.కె.లో 68 శాతం మంది ఉన్నారు. ప్రతి మ తంలోనూ కొన్నికొన్ని మౌలికమైన అంశాలున్నాయని నమ్మేవారు భారత్‌లో 73 శాతమైతే యు.కె.లో 45 శాతం మంది. విచిత్రమైన పరిస్థితి ఏమంటే మతానికీ, సైన్సుకు వైరుధ్యాలున్న సంగతి భారతీయ శాస్త్రవేత్తల్లో చాలామంది ఆలోచించనే ఆలోచించరు. మత విశ్వాసాలు లేకపోయినా తమను నాస్తికులుగా ముద్రవేయవద్దన్న శాస్త్రజ్ఞులు ఓ 16 శాతం మందున్నారు. సమాజంలో తమ విలువ తగ్గిపోతుం దేమోనని వారికి భయం! ప్రపంచ పరిజ్ఞానం, మత విశ్వా సాలు భారతీయ శాస్త్రవేత్తలలో ఎలా ఉన్నాయోనని ట్రినిటి కాలేజీలోని ఇనిస్టిట్యూట్ ఫర్ ద స్టడీ ఆఫ్ సెక్యులరిజమ్ ఇన్ సొసైటీ అండ్ కల్చర్ 2007లో నూటాముప్ఫై భారతీయ పరిశోధనా సంస్థల్లో పనిచేసే పదకొండు వందల శాస్త్రవేత్తల అభిప్రాయాలటా ఒక సర్వే నిర్వహించింది. ఇవన్నీ దాని ప్రకారం వచ్చిన ఫలితాలే. వందలయేళ్ళు బ్రిటీష్ పాలనలో మగ్గిపోయిన మనం, స్వాతంత్య్రం సంపాదించుకుని 70 ద శాబ్దాలవుతున్నా, ఇంకా మనకు సరిపడే విధానాలు రూపొం దించుకోక, బ్రిటిష్ పద్ధతులే అనుసరిస్తున్నాం. కానీ, విచి త్రం.. దైవభావం వదిలేయడంలో మనమూ, మన శాస్త్ర వేత్తలూ ఇంకా ఎంతో వెనకబడే ఉన్నాం. 

‘మతం లేని వైజ్ఞానిక శాస్త్రం కుంటిదేమోగానీ, వైజ్ఞా నికత లేని మతం మాత్రం పూర్తిగా గుడ్డిది’ అని అన్నారు అల్బర్ట్ ఐన్‌స్టెయిన్. ఆయన మరో విషయం కూడా చెప్పా రు. ‘మనకు అంతుపట్టని అనంతాలు రెండున్నా- ఒకటి విశ్వరహస్యం, రెండు మనిషి మూర్ఖత్వం. అయితే మొదటిది విశ్వరహస్యం గురించి నాకింకా కొన్ని అనుమా నా లున్నాయి!’ అని.. అంటే అనంతమైన మనిషి మూర్ఖత్వం గూర్చి ఐన్‌స్టెయిన్‌కు సందేహమే లేదన్నమాట! అందుకే ఎవరో అన్నారు- "Science does not know every thing. Religion does not know any thing అని. 

English Title
Science without religion is lame, religion without science is blind.




Related News