జెట్ ఎయిర్‌వేస్‌కు ఎస్‌బీఐ షాక్

jetairways
  • ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహిచాలని నిర్ణయం

  • నాలుగేళ్ల ఆడిట్ ఫైళ్లు తిరగదోడనున్న ఫోరెన్సిక్ టీం

ముంబై: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్ వేస్ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేందుకు ఎస్‌బీఐ సిద్దమైంది. కాగా, గత కొంత కాలంగా తీవ్ర ఆర్థిక సమస్యల కారణంగా ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో జెట్ సంస్థ కూరుకుపోయిన విషయం తెలిసిందే. అయితే జెట్ ఎయిర్‌వేస్ పలు బ్యాంకుల నుంచి దాదాపు రూ. 8,000 కోట్ల రుణాలు తీసుకుంది. ఇందులో అత్యధిక రుణదాతగా ఉన్న ఎస్‌బీఐ జెట్ సంస్థ ఆడిటల్‌లో లోపాలున్నట్లు అనుమానించింది. దీనిపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించి జెట్ సంక్షోభానికి అసలు కారణం తెలుసుకునే పనిలో పడింది. కాగా, గత మూడు త్రైమాసికల్లో జెట్ ఎయిర్‌వేస్ రూ. 1,000 కోట్లు అంతకంటే ఎక్కువే నష్టాలను నమోదు చేయడంతో రుణాలు మంజూరు చేసిన బ్యాంకులన్ని ఆత్మ రక్షణలో పడ్డాయనే చెప్పాలి. దీంతో తాజా నిర్ణయాన్ని ఆయా బ్యాంకులు కూడా స్వాగతిస్తున్నాయి. దీంతో జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన 2014 ఏప్రిల్ నుంచి 2018 మార్చి వరకూ ఆడిట్ ఫైల్‌ను ఫోరెన్సిక్ ఆడిటింగ్ కోసం తిరగదోడనున్నారు. కాగా, సంస్థ సంక్షోభానికి నరేశ్ గోయెల్ ప్రధాన కారణమని రూ. 5,000 కోట్లు ఆయన వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి జెట్ ఎయిర్‌వేస్ భారం రూ.8,052 కోట్లుగా ఉంది.

సంబంధిత వార్తలు