మోదీ యోగాపై సెటైర్లు పేలుతున్నాయ్..!!

Updated By ManamWed, 06/13/2018 - 21:08
Hum Fit Toh India Fit satires

Hum Fit Toh India Fit satires

మనం ఇంటర్నెట్ డెస్క్: గతంలో సోషల్‌ మీడియాలో ఐస్‌ బకెట్‌ చాలెంజ్‌, ప్యాడ్‌మాన్‌ చాలెంజ్‌లు తెగ వైరల్ అయ్యాయి. నెటిజన్లంతా ఈ చాలెంజ్‌లను స్వీకరిస్తూ ఓ ట్రెండ్‌ సెట్‌ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇలాంటి ఛాలెంజన్లను సెలబ్రెటీలు స్టార్ట్ చేస్తే మరింత ఈజీగా ప్రజల్లోకి వెళ్తాయి. అయితే ఇలాంటి తరహాలోనే మరో కొత్త చాలెంజ్‌ తెరపైకి వచ్చింది. హమ్‌ ఫిట్‌ హైతో ఇండియా ఫిట్‌ #HumFitTohIndiaFit అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. సరికొత్త చాలెంజ్‌ను తీసుకొచ్చింది  కేంద్ర కీడా శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగే. 

ఈ చాలెంజ్‌‌ను‌ ఒక్క రాజకీయ నాయకులే..  సినీ రంగంలో కూడా అగ్ర, యువ హీరోలు పెద్ద ఎత్తున స్వీకరిస్తూ తాము వర్కవుట్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎదుటి వారికి చాలెంజ్ విసురుతున్నారు. ఇలా ప్రస్తుతం ట్రెండ్ అంతా #HumFitTohIndiaFit మీదే నడుస్తోంది. అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ తన వర్కవుట్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసి.. ఇటీవల కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన హెచ్‌డీ కుమారస్వామికి చాలెంజ్ విసిరారు. దీంతో ఆయన స్పందించి కౌంటరిచ్చారు కూడా.

ఇక ఇవన్నీ అటుంచితే.. ఏదైనా ఒక్క ఫొటోకు లేదా వ్యక్తికి పబ్లిసిటీ, వైరల్ అవ్వడానికి మొట్టమొదటి ప్లాట్‌ఫామ్ ఒక్క సోషల్ మీడియా మాత్రమే. అది మంచైనా.. చెడైనా జనాలకు త్వరలో చేరవేసేది ఈ మాద్యమమే. అందుకే ఈ సోషల్ మీడియాను చాలా వరకు జనాలు విపరీతంగా వాడేస్తుంటారు. అయితే ప్రధాని మోదీ తన ఫిటెనెస్ వర్కవుట్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అందులోని కొన్ని ఫొటోలను స్క్రీన్ షాట్ తీసుకున్న కొందరు నెటిజన్లు మార్పింగ్ చేసి నెట్టింట్ట సెటైర్లు పేలుస్తున్నారు.. ఇప్పుడీ ఫొటోలు వైరల్‌గా మారాయి. అంతేకాదు వందలాది మంది ఈ ఫొటోలను షేర్ చేస్తున్నారు. కాగా ఈ ఫొటోలపై ఉన్న తమిళ అక్షరాలను బట్టి చూస్తే అక్కడి నెటిజన్లే ఇలా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

                      ఫొటోల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..
 

Hum Fit Toh India Fit

English Title
Satires on PM Modi yoga | Hum Fit Toh India Fit Challange
Related News