సంధు, శ్రీకాంత్ ఓటమి

Updated By ManamFri, 09/21/2018 - 23:46
Sandhu, Srikanth
  • ముగిసిన భారత్ పోరు..

  • మొమొటా చేతిలో కిదాంబి శ్రీకాంత్ మూడోసారి పరాజయం 

  • చైనా ఓపెన్ బ్యాడ్మింటన్

Sandhu, Srikanthచాంగ్‌ఝౌ: చైనా ఓపెన్ బీడబ్ల్యుఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగు తేజాలు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఓటమిపాలయ్యారు. దీంతో టోర్నీలో భారత్ పోరు ముగిసినట్టయింది. శుక్రవారమిక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 9-21, 11-21తో ప్రస్తుత వరల్డ్ చాంపియన్ కెంటో మొమొట చేతిలో ఓటమిపాలయ్యాడు. దీంతో 24 ఏళ్ల శ్రీకాంత్‌కు మొమొటాతో ముఖాముఖీ పోరులో 3-7 రికార్డు నమోదైంది. ఇంతకుముందు శ్రీకాంత్ జూన్‌లో మలేసియా ఓపెన్‌లో, జూలైలో ఇండోనేషియా ఓపెన్‌లో మొమొటా చేతిలో పరాజయంపాలయ్యాడు. చట్టవిద్ధంగా క్యాసినోకు వెళ్లి ఒక సంవత్సరం నిషేధానికి గురైన మొమొటా అసాధారణ ఫామ్‌లో ఉన్నాడు. అతని ఆట ముందు శ్రీకాంత్ నిలువలేకపోయాడు. ఆరంభంలో శ్రీకాంత్ 1-5తో వెనబడ్డాడు. తర్వాత వరుసగా మూడు పాయింట్లు సాధించి 4-5తో సమాన స్కోరుకు దగ్గరగా వచ్చాడు. కానీ తర్వాత మొమొటతో పోరాడలేకపోయాడు. 19-6తో భారీ ఆధిక్యాన్ని సంపాదించిన మొమొట తర్వాత తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో ఆరంభం నుంచే మొమొట 4-3 ఆధిక్యలో నిలిచాడు. తర్వాత వరుసగా తొమ్మిది పాయింట్లు 13-3 ఆధిక్యానికి చేరుకున్నాడు. ఆ తర్వాత కూడా మొమొట తన ఆధిపత్యాన్ని కొనసాగించి పెద్దగా కష్టపడకుండానే రెండో గేమ్‌ను, మ్యాచ్‌ను గెలుచుకున్నాడు.

ఇక మహిళల విభాగంలో మూడో సీడ్ పీవీ సింధు 11-21, 21-11, 15-21తో చైనాకు చెందిన ప్రపంచ 6వ ర్యాంక్ షట్లర్ చెన్ యూఫీ చేతిలో పోరాడి ఓడింది. గతంలో వీళ్లిద్దరు ఆరుసార్లు జరిగిన పోరాటంలో 20 ఏళ్ల సింధు నాలుగుసార్లు చెన్‌పై గెలిచింది. కానీ శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సింధు తన తప్పుదాలను అదుపు చేయడం కానీ ప్రత్యర్థి ఆధిపత్యాన్ని బ్రేక్ చేయడం కానీ చేయలేకపోయింది. తొలి గేమ్‌ను చెన్ 6-3 ఆధిక్యంతో ప్రారంభించింది. ఆ తర్వాత కూడా అమె అద్భుతమైన, పవర్‌ఫుల్ రిటర్న్ షాట్లతో 11-5 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బ్రేక్ తర్వాత సింధు రెండు పాయింట్లు సాధించింది. కానీ బలహీనమైన రిటర్న్ షాట్, మరో షాట్ అవుట్‌కు వెళ్లడంతో చైనీ షట్లర్ 15-7కు చేరుకుంది. సింధు కొన్ని తప్పిదాలు చేయడంతో చెన్ తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో వైవిధ్యమైన పేస్‌తో, రాల్లీస్‌తో ఆడాలన్న సింధు ఎత్తుగడ ఫలిం చింది. దీంతో సింధు 6-1 ఆధిక్యం సంపాదించింది. అయితే ప్రత్యర్థి చె న్ చాలా వేగంగా ఆడటం, ఊహిం చని స్మాష్‌ల కారణంగా 5-6కు చేరు కుంది. తర్వాత చెన్ కొట్టి షాట్స్ వైడ్‌గా వెళ్లాయి. దీంతో సింధు 10-6తో నిలిచింది. ఆ తర్వాత సింధు రెండు షాట్స్ నెట్‌కు తగలడంతో విరామం సమయానికి 11-8కి చేరు కుంది. విరామం తర్వాత సింధు 15-10 ఆధిక్యం సంపా దించింది. తర్వాత ఇద్దరూ చెరో పాయింట్ సాధిస్తూ హో రాహోరీగా పోరాడినప్పటికీ రెండో గేమ్‌ను సింధు గెలి చింది. ఇక చివరి, నిర్ణయాత్మక గేమ్‌లో ప్రత్య ర్థికి సింధు గట్టి పోటీ ఇచ్చింది. కానీ గేమ్‌ను సొంతం చేసుకోలేక పోయింది. 

English Title
Sandhu, Srikanth's defeat
Related News