స‌మంత సినిమాల‌ను మానేస్తుందా?

Updated By ManamFri, 07/06/2018 - 10:42
samantha

samantha స్టార్ హీరోయిన్‌గా తెలుగు, త‌మిళ చిత్రాల్లో రాణిస్తున్న స‌మంత అక్కినేని వారింటి కోడ‌లు అయిన త‌ర్వాత కూడా సినిమాల్లో రాణిస్తుంది. తమిళంలో రెండు సినిమాల‌తో పాటు తెలుగు, త‌మిళంలో `యు ట‌ర్న్` రీమేక్‌లో న‌టిస్తుంది. అలాగే తెలుగులో శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో భ‌ర్త చైతుతో క‌లిసి న‌టించ‌బోతుంది. అయితే చేతిలో ఉన్న సినిమాల‌ను పూర్తి చేసిన త‌ర్వాత సినిమాల నుండి స‌మంత త‌ప్పుకుంటుంద‌ని ఫిలిమ్ న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. చేతిలోని సినిమాల‌ను పూర్తి చేయ‌డానికి ఈ ఏడాది ప‌డుతుంది కాబట్టి.. 2019లో స‌మంత సినిమాలు మానేసే అవ‌కాశం ఉంది. మ‌రి ఈ వార్త‌ల‌పై ఏమ‌ని స్పందిస్తుందో వేచి చూడాలి.

English Title
Samantha say good bye to movies..?
Related News