సాయి కృష్ణకు అండగా ఉంటం

ktr
  • కేటీఆర్‌ను కలిసిన బాధితుని కుటుంబ సభ్యులు

హైదరాబాద్: అమెరికాలో దుండగుల చేతిలో తీవ్రమైన కాల్పులకు గురై చికిత్స పొందుతున్న మహబూబాబాద్ కు చెందిన విద్యార్థి సాయి కృష్ణకు అండగా ఉంటామని కేటీఆర్ తెలిపారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యులు మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో కేటిఆర్ ని కలిశారు. తమకు సాయం చేయాలని వారు కోరారు. సాయి కృష్ణ తల్లిదండ్రులు వెంటనే అమెరికాకు వెళ్లేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. సాయి కృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సాయి కృష్ణ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని అయితే పలు శస్త్ర చికిత్సలు ఆయనకు అవసరమని అక్కడ ఉన్న సాయి కృష్ణ మిత్రులు తమకు తెలియజేశారని తల్లిదండ్రులు కేటీఆర్ కు తెలిపారు. అవసరమైన  తక్షణ వైద్య సహాయం గురించి అమెరికాలోని కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి తమ ఎన్‌ఆర్‌ఐ శాఖ అధికారులు సమాచారం అందించారని కేటీఆర్ తెలిపారు. అవసరమైతే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మహ బూబాబాద్ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ నేరుగా సుష్మాస్వరాజ్ గారిని కలిసిన్నట్లు కేటీఆర్ తెలి పారు. సాయి కృష్ణ వైద్య సహాయం ప్రస్తుతం ఎలాంటి ఆటంకాలు లేకుండా అందుతుందని, అయితే ఆయనకు బీమా సౌకర్యం లేకపోవడంతో తమకు ఆర్థిక సహాయం అవసరమవుతుందని ఈ సందర్భంగా కేటిఆర్‌ను సాయి కృష్ణ కుటుంబ సభ్యులు కోరారు.  సాయి కృష్ణ ను అన్ని విధాల ఆదుకుంటామన్న కేటీఆర్, ముందుగా కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సహా యాన్ని తక్షణం అందించాలని ముఖ్యమంత్రి కార్యాలయ స్పెషల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి కి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లేందుకు అవసరమైన అత్యవసర వీసాలను  జారీ చేయాల్సిందిగా హైదరాబాద్లోని అమెరికా కాన్సుల్ జర్నల్ కేథరిన్ హెడ్డా తోనూ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. 

Tags

సంబంధిత వార్తలు