‘తేజ్ ఐ ల‌వ్ యు’ రివ్యూ

Updated By ManamFri, 07/06/2018 - 12:44
Tej
tej

హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌.. ల‌వ్ సినిమాల‌ స్పెష‌లిస్ట్‌  క‌రుణాక‌ర‌న్ కాంబినేష‌న్‌లో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం తేజ్ ఐ లవ్ యు. అయితే ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేంటే ఈ సినిమాలో కీల‌క‌మైన ఈ ఇద్ద‌రికీ స‌క్సెస్ అవ‌సరం. సాయిధ‌ర‌మ్ ఐదు వ‌రుస అప‌జ‌యాల త‌ర్వాత చేసిన చిత్రమిది. అలాగే ల‌వ్ స్పెష‌లిస్ట్ డైరెక్ట‌ర్‌కి కూడా డార్లింగ్ సినిమా త‌ర్వాత హిట్ ద‌క్క‌లేదు. స‌క్సెస్ అవ‌స‌ర‌మైన త‌రుణంలో ఈ ఇద్ద‌రూ క‌లిసి చేసిన ప్రేమ క‌థా చిత్రం `తేజ ఐ ల‌వ్ యు`.. ఇద్ద‌రికీ విజ‌యాన్ని అందించిందా?  లేదా?  అని తెలుసుకోవాంటే ముందుగా క‌థేంటో చూద్దాం..

చిత్రం:  తేజ్ ఐ ల‌వ్ యు
సెన్సార్‌:  యు
బ్యాన‌ర్‌:  క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ మూవీ మేక‌ర్స్‌
న‌టీన‌టులు:  సాయిధ‌ర‌మ్ తేజ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, పవిత్రా లోకేశ్‌, పృథ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ తదితరులు 
మ్యూజిక్‌:  గోపీసుంద‌ర్‌
ఆర్ట్‌:  సాహి సురేశ్‌
ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌
మాట‌లు:  డార్లింగ్ స్వామి
కెమెరా: అండ్రూ.ఐ 
నిర్మాత‌:  కె.ఎస్‌.రామారావు
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఎ.క‌రుణాక‌ర‌న్‌

క‌థ‌:
త‌న త‌ల్లి ఆశ‌యం మేర‌కు లండ‌న్ నుంచి హైద‌రాబాద్‌కి వ‌స్తుంది నందిని (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌) . అక్క‌డ అనుకోకుండా తేజ్ (సాయిధ‌ర‌మ్‌తేజ్‌)ని చూస్తుంది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు తేజ్‌. త‌న చెల్లెలిని ఆమెకు న‌చ్చిన వాడికిచ్చి పెళ్లి చేశాడ‌న్న కార‌ణంగా అంత‌కు మునుపే ఇంట్లో వాళ్ల‌కి దూరమ‌వుతాడు తేజ్‌. హైద‌రాబాద్‌లో చిన్నాన్న (పృథ్వి) ఇంట్లో ఉంటాడు. చిన్నాన్న కుమార్తెకు సాయం చేయ‌బోయి నందినిని ఏడిపిస్తాడు. దాన్ని అవ‌కాశంగా తీసుకుని 15 రోజులు త‌న‌కు బాయ్‌ఫ్రెండ్‌గా ఉండాల‌ని నందిని, తేజ్‌ని అడుగుతుంది. స‌రేన‌ని తేజ్ కూడా ఒప్పుకుంటాడు. కానీ ఒకానొక సంద‌ర్భంలో సీన్ రివ‌ర్స్ అవుతుంది. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు ద‌గ్గ‌రవుతున్నార‌ని అనుకుంటుండ‌గా ఆమెకు యాక్సిడెంట్ అవుతుంది. ఆ స‌మ‌యంలోనే నందిని తండ్రి లండ‌న్ నుంచి ఇండియాకు దిగుతాడు. నందినికి తేజ్‌ని దూరం చేస్తాడు. యాక్సిడెంట్ కార‌ణంగా నందినికి క‌లిగిన లాస్ ఏంటి? ఆమె ప్రేమ‌ను తేజ్‌కి చెప్ప‌గ‌లిగిందా?  లేదా? న‌ందిని తండ్రి మంచివాడా?  చెడ్డ‌వాడా?  తేజ్‌ని అత‌ని కుటుంబం అక్కున చేర్చుకుందా?  లేదా? ఇంత‌కీ నందిని తల్లి ఆశ‌యాన్ని నెర‌వేర్చ‌గ‌లిగిందా?  తేజ్ చిన్న‌త‌నంలో ఏడేళ్ల పాటు  శిక్ష ఎందుకు అనుభ‌వించాడు వంటివి ఈ చిత్రంలో కీల‌కం. 

tej

ప్ల‌స్ పాయింట్లు
- తేజ్ న‌ట‌న‌, లుంగీ గెట‌ప్‌
- అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ లుక్స్, న‌ట‌న‌
- కెమెరా ప‌నిత‌నం 
- కొన్ని ట్యూన్స్
మైన‌స్ పాయింట్లు
- ఫ్లాట్ స్టోరీ
- రొటీన్ స్క్రీన్‌ప్లే
- కామెడీ పెద్ద‌గా లేదు
- మాట‌లు
- ఎక్క‌డా కొత్త‌ద‌నం లేదు
- బోరింగ్ క్లైమాక్స్

సమీక్ష‌:
ప్రేమ క‌థాచిత్రాల స్పెష‌లిస్ట్‌గా పేరు తెచ్చుకున్న క‌రుణాక‌ర‌న్.. మెగా హీరోతో ప్రేమ‌క‌థా చిత్రం చేస్తున్నాడ‌నగానే సినిమాపై మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ గ‌త కొంత‌కాలంగా స‌క్సెస్‌లేని క‌రుణాక‌ర‌న్ మ‌రోసారి ల‌వ్ ఎమోష‌న్‌ను ప్రేక్ష‌కుడికి క‌నెక్ట్ చేయ‌డంలో విఫ‌ల‌మైన‌ట్లు స్ప‌ష్టంగా తెర‌పై క‌న‌ప‌డింది. హీరో.. త‌న‌కు న‌చ్చిన‌వాడితో చెల్లెలు పెళ్లి చేయ‌డం.. దాని వ‌ల్ల ఇంటి నుండి వ‌చ్చేయ‌డం.. ఓ సంద‌ర్భంలో హీరోయిన్‌ని చూసి ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌టం.. ఒక‌రిపై ఒక‌రు చిన్న‌పాటి క‌క్ష‌లు తీర్చుకోవ‌డం.. ప్రేమ‌లో ప‌డ‌టం.. ఉన్న‌ట్లుండి హీరోయిన్ గ‌తాన్ని మ‌ర‌చిపోవ‌డం.. ఆమెకు గ‌తాన్ని గుర్తుకు తెచ్చే క్ర‌మంలో హీరో అండ్ గ్యాంగ్ తాప‌త్ర‌య ప‌డ‌టం.. ఇలాంటి అంశాలన్నీ ఏదో ఒక చిత్రాల్లో ప్రేక్ష‌కులు చూసేసిన‌వే. ఎందుకంటే ద‌ర్శ‌కుడు త‌ను చెప్పాల‌నుకున్న ఏ విష‌యాన్ని స‌రిగ్గా పొట్రేట్ చేయ‌లేక‌పోయాడు. ప్రేమ‌లోని స్ట్ర‌గుల్‌.. తెర‌పై ప్రొట్రేట్ చేయ‌లేక‌పోయాడు క‌రుణాక‌ర‌న్‌. ఇక సినిమాలో స‌న్నివేశాలను కెమెరామెన్ అండ్రూ అందంగా చూపించాడు. గోపీసుంద‌ర్ అందించిన సంగీతంలో పాట‌ల్లో అంద‌మైన చంద‌మామ.. పాట మిన‌హా.. మిగ‌తావేవీ బాగా లేవు..అలాగే నేప‌థ్య సంగీతం కూడా మెచ్చుకునేలా లేదు. ల‌వ్ మ్యాజిక్ అన్నీ సంద‌ర్భాల్లో ఒకేలా ఉంటే వ‌ర్కవుట్ కాద‌ని క‌రుణాక‌ర‌న్‌కి తెలిసొచ్చి ఉంటుంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ రోల్ బావుంది. పృథ్వీ, జ‌య‌ప్ర‌కాశ్‌, ప‌విత్రాలోకేష్ స‌హా అంద‌రూ పాత్ర‌ల ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు. 

బోట‌మ్ లైన్‌:   తేజ్ ఐ ల‌వ్ యు.. ఆక‌ట్టుకోలేని ప్రేమ‌క‌థ‌
రేటింగ్‌: 2.5/5

English Title
Sai Dharam Tej's Tej I Love U review
Related News