సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ ప్రారంభం

Updated By ManamMon, 10/15/2018 - 10:05
Chitralahari

Chitralahari‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఓ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ‘చిత్ర లహరి’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ క్లాప్ కొట్టి చిత్రాన్ని లాంచ్ చేశారు. 

ఇక రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించనుంది. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించనున్నారు. నవంబర్ 2వ తేది నుంచి సెట్స్ మీదకు వెళ్లే ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుసగా ఐదు పరాజయాలతో ఢీలా పడ్డ సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకోగా.. ఉన్నది ఒక్కటే జిందగీతో పరాజయం పొందిన కిశోర్ తిరుమల ఈ మూవీతో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్నారు. 

English Title
Sai Dharam Tej's Chitra Lahari started
Related News