‘సహ్యాద్రి’ పరిరక్షణపై మల్లగుల్లాలు

Updated By ManamMon, 10/15/2018 - 03:42
western

సహ్యాద్రి పర్వతశ్రేణిలో సహజసిద్ధంగా ఏర్పడిన జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు పర్యావరణ వేత్త గాడ్గిల్ అందించిన నివేదికను కాదని, ఆ నివేదికను పలచన చేస్తూ కస్తూరీరంగన్ సమర్పించిన నివేదికకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపుతోంది. పశ్చిమ కనుమల్లో పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా యథేచ్ఛగా జరుగుతునన పర్యావరణ హననం వల్ల భవిష్యత్తులో ఎన్నో విపరిణామాలు సంభవించే అవకాశాలున్నాయని పర్యావరణ పరిరక్షకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా రాజకీయ ప్రయోజనాలను ఆశించి పెద్దపెద్ద పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం పథకాలు రూపొందించి ప్రకృతి నాశనానికి కారణమవుతున్న విద్యుత్కేంద్రాలు, ఇసక తవ్వకం, క్వారీయింగ్‌లకు అవకాశం ఇవ్వకుడా జీవవైవిధ్యాన్ని పరిరక్షించే చర్యలు చేపట్టాలి.

westernప్రకృతి కంటిచూపు మేరకు సంపూర్ణంగా కనిపించేలా ఉండాలి. ప్రకృతి పరిరక్షకులు ఇందుకోసమే కృషిచేస్తున్నారు. సహ్యాద్రి కొండప్రాంతంలో (పశ్చిమ కనుమలు) ప్రకృతి దృశ్యం ఆధారిత పరిరక్షణ నివేదికలు రూపొందుతున్నాయి. అభివృద్ధి పనుల పేరుతో పారిశ్రామిక వేత్తలకు అప్పగించ డం ద్వారా పశ్చిమ కనుమ జీవవైవిధ్యం కనుమరగయ్యే దశలో 2011లో ప్రముఖ పర్యావరణ వేత్త మాధవ్ గాడ్గిల్ పరిరక్షణ చర్యలపై నివేదిక స మర్పించినప్పటికీ దాన్ని కాదని కేంద్రం కస్తూరీ రంగన్ నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటుచేసింది. గాడ్గిల్ నివేదికలోని ముఖ్యమైన అంశాలను నీరుగారుస్తూ రెండో క మిషన్ సమర్పించిన నివేదక కేంద్ర పర్యావరణ శాఖ పరిశీలనలో ఉన్నది. ‘పశ్చిమ కనుమల ప్రాంతం ఎంతో సున్నితమైన’ (జట్చజజీజ్ఛూ)దని అటవీ అధికారి కె.ఎం.చిన్నప్ప చెబుతారు. ఆయన నగారాహోల్ నేషనల్ పార్కు లో సుదీర్ఘకాలం పనిచేశారు. ప్రస్తుతం పశ్చిమ కనుమ ల్లో జీవవైవిధ్యాన్ని పరిరక్షించేందుకు నెలకొల్పిన వైల్డ్ లైఫ్ ఫస్ట్ ప్రభుత్వేతర సంస్థకు అధ్యక్షుడుగా ఉన్నారు. ఈ సహ్యాద్రి పర్వతశేణి భారత ఉపఖండంలో ఆరురాష్ట్రాలపరిధిలో విస్తరించివున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోద్రా, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించిన ఈ పర్వత శ్రేణి ప్రధానమైన జీవ ప్రకృతిదృశ్యాన్ని కలిగివుంటుంది. విభిన్న వృక్ష, జంతుజాతులకు ఆలవాలం గా చెప్పుకోవచ్చు. జీవవైవిధ్యాన్ని కలిగివుండడమే కాకుండా 50 మిలియన్ల మందికి ఇది నివాసిత ప్రదేశం. వర్షపాతం, భూమి లక్షణాలు, పెరిగిన కొండచరియలతో వారు జీవనాన్ని కొనసాగిస్తుంటారు. ‘హిమాలయ ప్రాంతం వలే పశ్చిమ కనుమలు బండరాళ్లు, బంకమట్టితో కప్పబడి ఉంటాయి. అందుకే ఈ ప్రాంతం ఉద్యమాలకు ప్రఖ్యాతమైం’దని చిన్నప్ప చెప్పా రు. భూ వినియోగంలో మార్పుల వల్ల వర్షం వచ్చినపుడు కొండల వాలుతో భూ సమగ్రత క్షీణించడం సాధారణం. అందు వల్ల జీవవైవిధ్య పరిరక్షణ చర్యలు, అభివృద్ధి కార్యకలాపాలను తులనాత్మకంగా చేపట్టాలి. సహజ సుందర ప్ర కృతి దృశ్యం సంపూర్ణంగా వీక్షించగలిగేలా ఉండాలి. అం దు కోసమే ప్రకృతి పరిరక్షకులు నిరంతరం కృషిచేస్తున్నారు. త్వరలోనే పర్యావరణ నివేదికలు బహిర్గమవుతాయని భావిస్తున్నారు. కానీ, దురదృష్టవేుమిటంటే వాస్తవాన్ని గ్రహించాల్సి అవసరమంతెైనా ఉన్నది. 

గాడ్గిల్ ప్యానల్ నివేదిక
కేరళ, కర్ణాటకల్లో చాలా ప్రాంతాలపై ఈ ఏడాది కురిసి న వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. ఇదుకవ్కి, వయానంద్, మదికెరి తదితర ప్రాంతాలను పర్యావరణ సున్నిత ప్రాంతాలుగా (ఈఎస్‌ఏ) పశ్చిమ కనుమల పర్యావరణ ప్యానెల్ (డబ్ల్యుజిఈఈపీ) గుర్తించింది. దీన్నే సాధారణంగా గాడ్గిల్ ప్యానెల్ నివేదిక అని వ్యవహరిస్తారు. సెంటర్ ఫర్  ఎకాలజీ సైన్సెస్‌ను స్థాపించిన పర్యావరణ వేత్త మాధవ్ గాడ్గిల్ 2011లో పర్యావరణ మంత్రిత్వ శాఖకు నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో 64 శాతం సహ్యాద్రి పర్వత ప్రాంతం ఈఎస్‌ఏగా తెలిపారు. పర్యావరణ సున్నితత్వం ఆ ధారంగా ఈ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్లుగా ఆయన గుర్తించారు. వీటిని ఈఎస్‌జడ్ 1, ఈఎస్‌జడ్ 2, ఈఎస్‌జడ్ 3గా ఆయన పేర్కొన్నారు.

ఈఎస్‌జడ్ 1లో కొత్తగా అత్యధిక నిల్వ సామర్థ్యం వుండే డామ్‌లను ఎటువంటి పరిస్థితుల్లోను చేపట్టకూడదని నివేదికలో పేర్కొన్నారు. ఈఎస్‌జడ్ 1, ఈఎస్‌జడ్ 2ల్లో వైునింగ్ కార్యకలాపాల అనుమతుల్ని నరవధికంగా నిషేధించాలని సూచించారు. 2016 నాటికి ఈఎస్‌జడ్ 1లో వైునింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని, ప్రస్తుతం ఈఎస్‌జడ్ 2 లో కొనసాగుతున్న వైునింగ్ కార్యకలాపాలపై కఠిన నిబంధనలు విధించడం, సామాజిక ఆడిట్‌లు నిర్వహించాలని కోరారు. కాలుష్య పరిశ్రమలను నియంత్రించి, కొత్తగా బొ గ్గు ఆధారిత విద్యుత్‌ప్లాంట్లను అనుమతించకూడదని ఆయా రాష్ట్రాలకు నివేదికలో స్పష్టంచేశారు. పైవాటికంటే మరో ప్రధానమైన అంశం ఈ నివేదికలో పొందుపరిచారు. 

‘అన్ని నిర్ణాయక విధానాలను పశ్చిమ కనుమల (పర్యావరణ) సంస్థకు అప్పగించాలని గాడ్గిల్ నివేదికలో స్ప ష్టంగా ఉన్నది. పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా పర్యావరణపై 25 ఏళ్ల అనుభవం గల వ్యక్తి అధ్యక్షతన ఈ సంస్థను ఏర్పాటుచేయాలని సిఫార్సుల్లో పేర్కొన్నా’రని వైల్డ్‌లైఫ్ ఫస్ట్ సహ స్థాపకుడు ప్రవీణ్ భార్గవ్ తెలిపారు. ఈ నివేదికపై రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ‘తాలూకాలను అప్పగించేందుకు ఎన్నికైన ఏ ము ఖ్యమంత్రి కూడా అంగీకరించరు. ఇలాంటి ముఖ్యమైన ని వేదిక రాజకీయంగా వైముఖ్యాన్నే కలిగిస్తుం’దని ఆయన అభిప్రాయపడ్డారు. కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లో పశ్చిమ కనుమల విషయంలో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయని, అభివృద్ధి కార్యకలాపాల వల్ల పర్యావరణ నిబంధనలకు తూట్లు పడుతున్నాయని బెంగళూరుకు చెందిన పర్యావరణ, వాతవరణ పరిశోధనా సంస్థ అశోకా ట్రస్టు, సూరి సెహ్‌గల్ సెంటర్ ఫర్ బయోడైవర్సిటీకి చెందిన సిద్దార్థ కృష్ణన్ అన్నారు. 

కస్తూరిరంగన్ కమిటీ నివేదిక
ఈ నివేదికను పూర్తిగా పక్కన పెట్టలేదు. ‘గాడ్గిల్ నివేదిక అనంతరం జరుగుతున్న పరిణామాలను జాతీయ గ్రీన రీ ట్రిబ్యునల్ పరిశీలిస్తోంది. ప్రగతిశీల మీడియా, పౌరులతో కస్తూరిరంగన్ కమిటీని నియమించారని కృష్ణన్ తెలిపారు. ఈ కమిటీకి భారత అంతరిక్ష పరిశోళనా సంస్థ మాజీ చైర్మన్ కృష్ణస్వామి కస్తూరిరంగన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నివేదిక గాడ్గిల్ నివేదికను కొంతవేురకు నీరుగార్చింది. పశ్చిమ కనుమల్లోని 37 శాతం ప్రాంతాన్నిమాత్రమే ఈఎస్‌ఏగా ఈ కమిటీ గుర్తించింది. పశ్చిమ కనుమలను రెండుభాగాలుగా ఈ కమిటీ విభజించింది. సాంస్కృతిక, పర్యావరణ ప్రాంతాలుగా విభజించి అందులో పర్యావరణ ప్రాంతంగా 37 శాతాన్ని పరిగణనలోకి తీసుకున్నది. పర్యావరణానికి ము ప్పు వాటిల్లజేసే స్థాయిలను బట్టి పూర్వ కమిషన్ అయిన గాడ్గిల్ రెడ్, ఆరంజ్, గ్రీన్ కేటగిరీలుగా విభజించగా, రెడ్ కేటగిరి పరిశ్రమలను (వైునింగ్, క్వారీయింగ్) నిషేధించాలని, ఆరంజ్ కేటగిరీ (ఫుడ్ ప్రాసెసింగ్, హోటళ్లు, రెస్టారెం ట్లు) పరిశ్రమలను నియంత్రించాలని, గ్రీన్ కేటగిరికి చెంది న వాటిని (కాయధాన్యాలు, గ్రైన్ ప్రాసెసింగ్) పరిశ్రమలను యథాతథంగా అనుమతించాలని కస్తూరి రంగన్ సిఫార్సు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న కార్యకలాపాలన్నీ గ్రీన్, ఆరంజ్ కేటగిరీలకు చెందిన ప్రాంతాల్లో కొనసాగుతున్నాయని భార్గవ్ తెలిపారు. రెడ్ కేటగిరీకి చెందిన ప్రాంతాల్లో ఇసుక తవ్వకం, క్వారీయింగ్ పనులు జరుగుతున్నాయి. కస్తూరీ రంగన్ 37 శాతం పర్యావరణ ప్రాంతంగా చెప్పడమే పరిరక్షకులకు సమస్య వచ్చింది. పశ్చిమ కనుమల్లో ఈ ఎస్‌ఏ కింద 37 శాతం భూమిని మాత్రమే గుర్తించడం వల్ల ఈ ప్రాంతంలో విద్యుత్కేంద్రం వంటి అభివృద్ధి పనులు మిగిలిన 63 శాతం ప్రాంతంలో నిరాటంకంగా కొనసాగుతాయని పరిరక్షకులు ఆందోళన వ్యక్తచేస్తున్నారు. 2013లో కస్తూరి రంగన్ నివేదిక కేంద్రానికి సమర్పించగా దానికి వ్యతిరేకంగా రాజకీయనాయకులు, పారిశ్రామికవేత్తల నుం చి వెంటనే వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నివేదికలోని సిఫార్సుల గురించి తప్పు సమాచారం విస్తృతంగా ప్రచారం లోకి వచ్చింది. ప్రజలకు చెందిన భూముల నుంచి పనులు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పర్యావరణ పరిరక్షణ చట్టం ఎలాంటి అధికారాలు ఇవ్వలేదని భార్గవ్ చెప్పారు. కానీ, తమ భూములను లాక్కుని తమచేత ఖాళీ చేయిస్తారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. 

విజ్ఞానశాస్త్రం, విధానాల పరిధిలో కస్తూరీ రంగన్ నివేదిక శక్తిమంతమైనదని భావిస్తే, దాని గురించి ప్రభుత్వం కొంత చైతన్యం కలిగించే యత్నాలు చేపట్టాల్సి ఉంటుంది. కాగా, అదే సమయంలో రాష్ట్రప్రభుత్వాల నుంచి శత్రుత్వం పెరుగుతోందని కృష్ణన్ తెలిపారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) పరిశీలనలోనే ఈ రోజుకూ కస్తూరీరంగన్ నివేదక ఉన్నది. ఈ నివేదకను ఆమోదిస్తూ 2017 ఫిబ్రవరిలో కేం ద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ముసాయిదా నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక అమలుకు చర్యలు తీసుకోవలసిందిగా గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేర ళ రాష్ట్రాలకు సూచించింది. పశ్చిమ కనుమల ఈఎస్‌ఏలపై ఆరునెలల్లో నోటిఫికేషన్‌కు తుదిరూపు తేవలసిందిగా కేంద్ర మంత్రిత్వశాఖను గత ఆగస్టు 24న ఎన్‌జీటీ ఆదేశించింది. తన అనుమతి లేకుండా ఈఎస్‌ఏ ప్రాంతాలను తగ్గించవద్దని ఎన్‌జీటీ ఆదేశించింది. ముసాయిదా నోటిఫికేషన్‌ను ఖరారు చేయవలసింది కేంద్ర పర్యావరణ శాఖేనని భార్గవ్ అభిప్రాయపడ్డారు. దీనిపై జాప్యం జరిగితే స్థానికుల్లో అమోమయం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌లో ఇంకా నీరు గార్చే అంశాలు చొరబడకుండా పరిరక్షకులు చూడాల్సి ఉంది. 
 రిషిక పర్దీకర్, బెంగళూరు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
(‘ద వైర్’ సౌజన్యంతో)

Tags
English Title
'Sahadrilli' protection against the conservation
Related News