తాప్సీ చిత్రంపై సచిన్ ప్రశంసలు

Updated By ManamThu, 07/12/2018 - 12:47
sachin, taapsee

Soorma టీమిండియా హాకీ మాజీ కెప్టెన్, ప్రముఖ క్రీడాకారుడు  సందీప్ సింగ్ సూర్మా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సూర్మా’. దిల్జిత్ సింగ్ ఇందులో సందీప్ సింగ్ పాత్రలో నటించగా.. ఆయన భార్య హర్జిందర్ కౌర్ పాత్రలో తాప్సీ కనిపించింది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంపై విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని చూసిన క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూడా తన అభిప్రాయాన్ని తెలిపారు.

‘‘ఒక నిజ జీవిత కథను తెరపై అద్భుతంగా చూపించారు. దేశ ప్రతిష్ట కోసం సందీప్ సింగ్ పోరాటం నిర్వచించలేనిది. సూర్మాను చూసి చాలా ఎంజాయ్ చేశారు. ఈ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరికి బెస్ట్ విషెస్’’ అంటూ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో బాలీవుడ్‌లో మరో సక్సెస్‌ను ఖాతాలో వేసుకుంది తాప్సీ.

English Title
Sachin Praises on Soorma
Related News