యూరప్‌కు ‘సాహో’

Updated By ManamFri, 08/10/2018 - 17:18
Saaho

Saaho`బాహుబలి` చిత్రంతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు ప్రభాస్. ఈ హీరో ఇప్పుడు ‘సాహో’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇటీవల అబుదాబిలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణను జరుపుకుంటుంది. త్వరలోనే సాహో టీమ్ యూరప్‌లోని రొవేునియాకు వెళ్లనుందని సమాచారం. ఈ షెడ్యూల్‌తో మొత్తం టాకీపార్ట్ పూర్తవుతుందట. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే నీల్ నితిన్, మందిరా బేడి, చంకీ పాండే వంటి బాలీవుడ్ తారలు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ వజ్రాలను దొంగిలించే అంతర్జాతీయ దొంగ పాత్రలో కనిపిస్తారని సమాచారం. 

English Title
Saaho team moving to Europe
Related News