సామాజిక ‘అశుద్ధమే’ అడ్డంకి!

Updated By ManamThu, 07/12/2018 - 00:17
image

imageజూలై 2వ తేదీ సాయంత్రం తమిళనాడులో పోలీసులు ఒక మహిళ ఆచూకీ కోసం ఆమె ఇంటిని చుట్టుముట్టి, గోడలు దూకి ఇంటిలో వారిని వేధిం చారు. ఆమె ఇంటిలో అంగుళం అంగుళం శోధించారు. ఒక వివాదా స్పద మైన డాక్యుమెంటరీ చిత్రంపై విచారణ జరిపేందుకు ఆమె పోలీస్‌స్టేషన్ రావాలని హెచ్చరించారు. ఆ తర్వాతి రోజు మధురై జిల్లా కోర్టు బయట ఆమె కారును అడ్డగించి నిర్బంధించాలని సివిల్ డ్రస్‌లో ఉన్న పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆమె మధురై బార్ కౌన్సిల్‌లో న్యాయవాదుల రక్షణలో పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకుంది. ఆమె మరెవరో కాదు.. 2017లో తమిళనాడులో పాకీ పని (మాన్యువల్ స్కావెంజ రింగ్) చేస్తున్న ప్రజల రోజువారీ జీవితాలను సజీవంగా చిత్రీకరించిన ‘కక్కూస్’ అనే డాక్యుమెంటరీ సినిమా డైరెక్టర్, సామాజిక కార్యకర్త దివ్య భారతి. పాకీ పనికి మూలాలు భారతీయ సమాజంలోని కులవ్యవస్థలో లోతుగా వేళ్లూనుకొని ఉన్నాయి.

2013లో పాకీ పనిని నిషేధించినప్పటికీ సమాజంలో పాతుకు పోయిన కుల వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా కొనసాగిస్తుండడం వల్ల ఆ నిషే ధిత శ్రమ విభజన అమలులోనే ఉన్న విషయాన్ని ఆ డాక్యుమెంటరీ సజీ వంగా చిత్రీకరించింది. ఆ చిత్రం ప్రారంభం నుంచి వివాదాస్పదంగానే నడి చింది. సీబీఎఫ్‌సీ సర్టిఫికేషన్ ఇచ్చేందుకు అనుమతించలేదు. దాంతో యూ ట్యూబ్‌లో చిత్రాన్ని విడుదల చేయడంపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఆ డాక్యుమెంటరీపై వెర్రిమొర్రి సమీక్షలు కూడా వెల్లువెత్తడంతో వివాదం చెల రేగింది. 2009లో సామాజిక కార్యకలాపాలకుగాను ఒకానొక కేసు విషయం లో దివ్యభారతిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. సామాజిక దుష్టత్వానికి సాధనమైన కులవ్యవస్థ, దాని వికృత రూపాన్ని, దాని ప్రభావంతో కొనసాగు తున్న పాకీ పని వంటి అత్యంత హేయమైన శ్రమజీవుల జీవితాలను దృశ్యీ కరించిన ఒకానొక దర్శకురాలు దివ్యభారతిని ఉగ్రవాది వలె రాజ్యం వేటాడ టం, చంపుదామని కుల దురహంకారులు బెదిరించడం దారుణం.

ఫ్యూడల్ కాలం నుంచి కొనసాగుతున్న పాకీ వృత్తిని అంతరిక్ష కాలం నాటికీ పూర్తిగా నిర్మూలించ లేకపోవడం ప్రభుత్వాల అమానుష నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తుంది. పైగా అలాంటి ఉదంతాలను సమాజం ముందుకు తీసుకొస్తున్న వారిపై అణచివేతను ప్రయోగించడం క్షమించరానిది. అదీ కుంభకోణాల్ని, చీకటి కథనాల్ని, దారుణ అకృత్యాలను ఉద్వేగభరితంగా వ్యక్తీకరిస్తున్న మీడియా సైతం భూగర్భ డైనేజీ చీకట్లలో మగ్గే జీవితాలను, పియ్య, పెంట ల్ని చేతులతో శుభ్రం వారి జీవితాల్లోని  చీకట్లను వెలుగు తీసుకురావడం లోనూ విఫలమైంది.     
నేటికీ కొనసాగుతున్న పాకీ పని విధానం ఈ సమూహంలోని మను షులను ఏ విధంగా ధ్వంసం చేసిందో, ఒక తీవ్రమైన జీవన అభద్రతకు ఎంతలా గురిచేసిందో మనమెవ్వరమూ గుర్తించను కూడా గుర్తించ లేకపో వడం అమానుషం. తోటి మనుషుల పియ్య పెంటలను తమ చేతులతో ప్రతిరోజూ ఎత్తవలసి రావటం అనే అసహ్యకరమైన విధానం ఒక ఫ్యూడల్ అణిచివేతకు చిహ్నం. పాకీ పని చేసే కుటుంబాలలో ఈ అణచివేత ఒక తరం నుంచి ఇంకో తరానికి సంక్రమిస్తూ మొత్తం సమూహాన్నే బాధితులుగా మారుస్తుంది.

ఆ జనం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం పనిచేస్తున్నారని అడిగితే  ‘మా పని మేం చేస్తున్నాం’ అనే సమాధానం వస్తుంది. తరాల తరబడి కొన సాగుతున్న ఈ అమానుషత్వాన్ని కనీసం ప్రశ్నించను కూడా ప్రశ్నించకుండా ఈ ప్రజలు దానికి తలొగ్గి పనిచేస్తుండడం కుల వ్యవస్థ సృష్టించిన సంప్ర దాయంలో భాగమే. అది పాకీవాళ్ళను నిరంతరం అణిచి వంచేందుకు భౌతిక దాస్యం, అణచివేత కంటే భావజాల దాస్యం, భావజాల అణచివేత అత్యంత శక్తిమంతమైనది. ఈ బాధ్యత వేరే వాళ్ళది కాదని పాకీ సమూహం భావిస్తే... ఈ బాధ్యత పాకీ సమూహానిదే అని సమాజమూ, ప్రభుత్వమూ భావిస్తున్నాయి. అమానవీయమైన, చట్టవిరుద్ధమైన ఈ పనిని అంతమొం దించటానికి అట్టడుగు స్థాయి నుంచి విముక్తి ఉద్యమం ప్రారంభం కావాలి. ఇప్పుడిప్పుడే ఆ చైతన్య పూరిత కార్యాచరణ దేశవ్యాప్తంగా పలుచోట్ల ప్రారం భమైంది. ఆత్మగౌరవం, స్వాలంబన కోసం వారి పోరాటం కొనసాగుతోంది.

ఈ పోరాటానికి సహకరించాల్సిది పోయి ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, సమా జం అందరూ కూడా వారి దారిలో ఎన్నో అవరోధాలు సృష్టిస్తున్నారు. పాకీ పని విధానాన్ని సంపూర్ణంగా నిర్మూలిస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఈ రోజుకి కూడా తాము పెట్టిన కాలపరిమితుల్ని తామే ఉల్లంఘిస్తున్నాయి. గత ఇరవై సంవత్సరాలుగా కనీసం తొమ్మిదిసార్లు ఈ విధంగా జరిగిందని 2016 ప్రతి ష్ఠాత్మక రామన్ మెగసేసే అవార్డుకు ఎంపికైన సామాజిక సేవకుడు బెజవాడ విల్సన్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. పాకీ జీవితాలపై భాషాసింగ్ అనే జర్న లిస్ట్ క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి రాసిన ‘అన్‌సీన్ ః ద ట్రూత్ ఎబౌట్ ఇండియాస్ మాన్యువల్ స్కావెంజింగ్’ (తెలుగులో ‘అశుద్ధ భారతం’ గ్రంథం ప్రపంచానికి పాకీ జీవితాలను అత్యంత సమీపం నుంచి పరిచయం చేసింది.

కులవ్యవస్థ చట్రంలో బిగుసుపోయిన పారిశుథ్య శ్రమ విభజన లో మౌలిక సంస్కరణ రావడం చాలా సంక్లిష్ట మైన ప్రక్రియ. జీవించే హక్కుతో పాటు హుందా జీవిం చే హక్కును కూడా పౌరులకు రాజ్యాంగం ప్రసాదించింది. చేతితో మలాన్ని శుభ్రం చేసే పాకీపని చేయడం లేదా అందు కోసం పనివారిని పెట్టుకోవడాన్ని 1993లోనే ప్రభుత్వం పాకీ పనిని (పొడి టాయి లెట్స్) నిషేధిస్తూ చట్టం చేసింది. 2013లో ఆ చట్టాన్ని అపరిశుభ్ర మరుగు దొడ్లు, మురుగు కాలువలు, గుంటలు శుభ్రంచేసే పనులకు కూడా విస్తరిస్తూ, మరింత స్పష్టతతో చట్టాన్ని సవరించింది. చట్టాలు ఎన్ని చేసినా కుల వ్యవస్థ కొనసాగుతున్నంత కాలం పాకీ శ్రమ విభజన పూర్తిగా అంతరించిపోవడాన్ని పాలక వర్గాలు, వర్ణాలు తీవ్రంగా అడ్డుకో వడం వల్ల ఆచరణలో ఆ నిషేధం విఫలమైంది. ఇప్పటికీ దేశంలో ఎంత మంది ఈ పాకీ పనిలో చేస్తున్నారనే విషయంపై ప్రభుత్వం వద్ద స్పష్టమైన గణాంకాలు లేకపోవడం పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనం. పాకీపని వారి జనగణన కోసం అనేక సర్వేలు జరిగాయి. 2002-03 మధ్యకాలంలో 7 జాతీయ సర్వేల ప్రకారం ‘సుమారు 8 లక్షల మంది’ పాకీ శ్రమ చేస్తు న్నట్లు వెల్లడైంది. ఆ తర్వాత 2013లో జరిగిన సర్వే ప్రకారం 13,639 మంది ఉండగా, ఈ ఏడాది జూన్‌లో భారత ప్రభుత్వం నిర్వహించిన జాతీయ స్థాయి సర్వేలో 53 వేల మంది ఉన్నట్లు వెల్లడైంది.

పాకీ పనివాళ్ల జనగణనలో నెలకొన్న మార్మి కతకు ప్రధాన కారణంగా పాకీ వృత్తి అంటే ఏమిటనే స్పష్టమైన నిర్వచనం లేక పోవడమే. ఈ వృత్తికి సంబంధించి వివిధ రకాల పార్శ్వాలను, అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవ సరం ఉంది. అదీకాక పాకీ పనివారిలో మెజారిటీ సంఖ్యలో దళితులు, ముఖ్యంగా మహిళలే పని చేస్తున్నారు. పాకీ పని నిషేధ చట్టం, వివిధ రకాల నిరసనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆధునిక టాయిలెట్లు, డ్రైనేజీ వ్యవస్థలు ఉనికిలోకి వచ్చిన మాట నిజమే. అయితే ఆధునిక సాంకేతిక పరిజా్ఞనం ఎలా ఉన్నా, డైనేజీ శుభ్ర చేయ డంలో కొన్ని చోట్ల మనుషులు మాత్రమే పనిచేయవలసి ఉంటుంది. యంత్రాలు మారినా, సాంకేతిక మారినా, డ్రైనేజీ వ్యవస్థలు అధునాతన మైనవి ఉనికిలోకి వచ్చిన పాకీ వాళ్లు మాత్రం ఆ మార్పులకు అనుగుణంగా అదే రంగంలో కొన సాగుతున్నారు. ప్రభుత్వాలు, పౌర సమాజం పాకీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఉ మ్మడిగా కృషి చేయవలసిన అవసరం ఉంది. ‘సామాజిక అశుద్ధం’గా నిలిచిన కుల వ్యవస్థ నిర్మూలనకు ప్ర జలు ఉద్యమించాల్సి న తరుణమిది.
- సూరేపల్లి సురేష్ కుమార్

English Title
సామాజిక ‘అశుద్ధమే’ అడ్డంకి!
Related News