సెప్టెంబరు 30నాటికి పంపులు రన్ చేయండి

Updated By ManamTue, 06/19/2018 - 02:07
harish
  • జులై 15 కల్లా క్రాస్ రెగ్యులేటరీ పనులు పూర్తి కావాలి

  • కార్మికుల సంఖ్య పెంచాలని ఎజెన్సీలకి ఆదేశం

  • వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రిహరీశ్ రావు సూచన

harishహైదరాబాద్: ఎస్‌ఆర్‌ఎస్‌పీ పునరుజ్జీవన పథకంపై సచివాలయంలో మంత్రి మంత్రిహరీశ్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌నిర్వహించారు. తొలి దశలో మూడు పంపు హౌస్‌లలో ఎనిమిది పంపులకుగాను మూడేసి చొప్పున పంపులను పూర్తి స్థాయిలో సెప్టెంబరు 30 కల్లా పూర్తి చేయాలని ఇంజనీర్ల ను ఆదేశించారు. దీనికి అనుగుణంగా సివిల్ పనులను, ఎలక్ట్రికికల్ పనులను, సబ్ స్టేషను, పవర్ లైన్లను పూర్తి చేయాలన్నారు. అవసరమైన కార్మికులను,  బూమ్ ప్లెసర్‌ను సిద్దం చేసుకోవాలన్నారు. లేబర్ ను పెంచాలని ఏజెన్సీని ఆదేశించారు. పంపుకు సంబంధించిన యంత్ర పరికరాలన్నీ చైనా నుంచి వస్తున్నాయని ఎజెన్సీ ప్రతినిధులు తెలిపారు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, లిఫ్ట్ పనుల సమన్వయం, పర్యవేక్షణ నిరంరం జరపాలని లిఫ్ట్ సలహాదారు పెంటారెడ్డిని, ఈఎన్‌సీ అనిల్‌ను ఆదేశించారు. వరద కాలువల్లో నీరు వచ్చినా జులై 15 కల్లా క్రాస్ రెగ్యులేటరీ పనులు పూర్తి స్థాయిలో పూర్తి చేయలన్నారు. ప్రతీ డీఈ కనీసం ఒక కెనాల్‌లో టైల్ టూ హెడ్ పద్ధతి అమలు చేసేలా  ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్టు ఇంజనీర్లు అందు అదిశగా పని చేయలన్నారు. రైతు సమన్వయ సమితి, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సమావేశాలు నిర్వహించుకుని, రైతులకు ఈ ప్రయోజనాలు వివరించాలన్నారు. డీఈల వారీగా దీనిపై ప్రణాళిక పంపాలన సీఈ శంకర్‌ను ఆదేశించారు. ఇందులో ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్ 1, స్టేజ్ 2 పనులు, ఎస్‌ఆర్‌ఎస్‌పీ పునరుజ్జీవ పథకంపై మంత్రి మంత్రిహరీశ్ నిర్వమించిన వీడియో కాన్ఫరెన్స్‌కు ఈఎన్‌సీ మురళీధర్, ఈఎన్.సీ ( కరీంనగర్) అనిల్ కుమార్, లిఫ్ట్స్ సలహదారు పెంటారెడ్డి, ఓఎస్డీ శ్రీథర్ దేశ్ పాండే, వరంగల్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లా కేంద్రాల నుంచి ఇంజనీర్లు హజరయ్యారు.

Tags
English Title
Run pumps by September 30
Related News