రూ.93 కోట్ల నగదును సీజ్‌ చేశాం: డీజీ జితేందర్ 

DG Jitender, illegal money, Telangana assembly elections 

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో తరలిస్తున్న మద్యం, కోట్లాది నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు డీజీ జితేందర్‌ మాట్లాడుతూ.. అన్ని పార్టీలకు చెందిన నగదును తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.93 కోట్ల నగదును సీజ్‌ చేశామని, పట్టుబడిన హవాలా డబ్బుపై విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. పోలింగ్‌కు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేశామని డీజీ తెలిపారు. 

అల్లర్లకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో కొందరు పోలీసు అధికారులపై ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలిస్తున్నామని జితేందర్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 414 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, 404 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల నిబంధలను అతిక్రమించి వారిపై 1,353 కేసులు నమోదు చేశామన్నారు. 4 లక్షల లీటర్లకు పైగా మద్యాన్ని సీజ్‌ చేసినట్లు డీజీ జితేందర్‌ పేర్కొన్నారు. 

Image removed.Image removed.

సంబంధిత వార్తలు