రైతన్నకు 5 లక్షల బీమా

Updated By ManamWed, 05/16/2018 - 01:51
cm-kcr
  • మరణించిన రైతు కుటుంబాలకూ వర్తింపు.. అన్నదాతకు సీఎం కేసీఆర్ మరో వరం

  • ఎల్‌ఐసీ సంస్థతో మాట్లాడండి.. ప్రీమియం సర్కారే చెల్లిస్తుంది

  • ఈ పథకం దేశానికే ఆదర్శం.. ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి

kcrహైదరాబాద్: తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ మరో వరం ప్రకటించారు. రైతులందరికీ రూ.5 లక్షల ప్రమాద బీమా వర్తింపజేయాలని నిర్ణయించారు. అలాగే.. మరణించిన రైతుల కుటుంబానికి కూడా రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.. ఈ నిర్ణయంతో తెలంగాణ ప్రభు త్వం యావత్తు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంద న్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో రైతులకు బీమా సౌకర్యం కల్పించే అంశంపై సమీక్ష నిర్వహిం చారు.  ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... మరణించిన రైతు కుటుంబాలకు బీమా కల్పించే విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి విధి విధానాలను ఖరారు చేయాలని అధికారులను ఆదే శించారు. పథకం ఎలా అమలు చేయాలనే విషయంపై అధికారులు, బీమా సంస్థల ప్రతినిధులతో విపులంగా చర్చించారు. రైతుల తరపున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమా పథకం అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. దీని కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం అత్యంత దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నదని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వ్యవసాయరంగం కుదుటపడుతున్నదన్నారు. రైతులు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ఏదైనా కారణం వల్ల రైతు మరణిస్తే ఆ కుటుంబం దిక్కులేనిది కావద్దనే ఉద్దేశంతోనే బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించామన్నారు. చిన్న, సన్నకారు, పెద్దరైతు అనే తేడా లేకుండా బీమా సౌకర్యం రైతులందరికీ వర్తింపచేయాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం రైతులందరూ సభ్యులుగా గ్రూప్ రెన్స్ చేయించాలన్నారు. దేశంలో లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ)కు పెద్ద యంత్రాంగం ఉందని, అది ప్రభుత్వ సంస్థ, ప్రజలపై దానికి నమ్మకముందన్నారు. అందుకే ఎల్‌ఐసీ ద్వారానే రైతుల బీమా పథకాన్ని అమలు చేయాలని సూచించారు. రైతుల బీమా పథకం దేశంలోనే మొదటిది కావడంతోపాటు రైతులలో ఆత్మ విశ్వాసం పెంచుతుందన్నారు. రైతుల్లో వివిధ వయస్కులకు చెందినవారు ఉంటారని, అందుకే ఎల్‌ఐసీ నిబంధనలు ఎలా ఉన్నాయో, తెలంగాణ రైతు బీమా పథకం ఎలా ఉండాలనే అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. గ్రామాలు, మండలాల వారిగా రైతుల జాబితా, వారి నామిని జాబితాను రూపొందించాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే. జోషి, సీనియర్ అధికారులు అజయ్ మిశ్రా, పార్థసారథి, ఎస్. నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, అధర్ సిన్హా, శివశంకర్, జగన్‌మోహన్‌రావు, భూపాల్ రెడ్డి, జీవిత బీమా సంస్థ అధికారులు పాల్గొన్నారు.

Tags
English Title
Rs 5 lakh for the trainer
Related News