అభిప్రాయం చెప్పడానికే ఆర్పీ పాత్ర పరిమితం

Updated By ManamWed, 05/16/2018 - 00:03
binani

binaniన్యూఢిల్లీ: సవరణలతో వచ్చిన బిడ్ల ఆమోదయోగ్యతపై నిర్ణయించడం కాక, వాటిపై వ్యాఖ్యలను మాత్రం రుణ దాతలకు సమర్పించవలసిందని, బినాని సిమెంట్ వ్యవహారంలో పరిష్కార నిపుణుడి (ఆర్పీ)ని జాతీయ కంపెనీలా అప్పిలేట్ ట్రైబ్యునల్ ఆదేశించింది. బినానీ సిమెంట్ దివాలా వ్యవహారంలో అల్ట్రా టెక్ దాఖలు చేసిన దరఖాస్తుపై వాదనలు వింటూ అప్పిలేట్ ట్రైబ్యునల్ ఆ విధంగా వ్యాఖ్యానించింది. సవరించిన బిడ్‌లు ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ప్ట్స్రీ కోడ్‌కు అనుగుణంగా ఉన్నాయా లేవా అనే అంశానికి సంబంధించిన ప్రశ్నలపైన మాత్రమే తన వ్యాఖ్యలను రుణ దాతల కమిటీకి సమర్పించాల్సి ఉంటుందని జస్టిస్ ఎస్.జె. ముఖోపాధ్యాయ అధ్యక్షతన గల అప్పిలేట్ ధర్మాసనం ఆదేశించింది. ‘‘ఆర్పీ ప్రతి ప్రణాళికను పరిశీలించి అభిప్రాయాలు తెలుపగలరేకానీ, పరిష్కార ప్రణాళికపై అభిప్రాయం వెలిబుచ్చలేరు’’ అని ధర్మాసనం పేర్కొంది. ఆర్పీ వ్యాఖ్యలను సీల్డు కవరులో ఉంచి రుణ దాతల కమిటీకి అందజేయాల్సి ఉంటుందని కూడా ధర్మాసనం ప్రకటించింది. ‘‘వచ్చిన వాటిలో ఏదో ఒక ప్రణాళికను... కమిటీ ఆమోదించాలి. కమిటీ అందుకు గల కారణాలను కూడా నమోదు చేయాలి’’ అని ధర్మాసనం పేర్కొంది. ఈ అప్పీలు ఫలితాన్ని బట్టే కమిటీ  ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. సవరించిన బిడ్‌లను సమర్పించిన అల్ట్రాటెక్ పెట్టుకున్న దరఖాస్తుపై అప్పిలేట్ ట్రైబ్యునల్ వాదనలు వింది. బిడ్‌ల ఆమోదయోగ్యతను ఆర్పీయే నిర్ణయించేస్తే,  జాతీయ లా ట్రైబ్యునల్ ప్రొసీడింగులకు సమాంతరంగా మరో ప్రొసీడింగులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని అల్ట్రాటెక్ తరఫు వకీలు ముకుల్ రోహత్గి న్యాయమూర్తులకు వివరించారు.

Tags
English Title
The role of RP is limited to the opinion
Related News