అతిథి పాత్రలో..

Updated By ManamTue, 06/19/2018 - 06:58
Kajal-Aggarwal

Kajal-Aggarwalతెలుగులోని ఈ తరం అగ్ర కథానాయకులందరితోనూ ఆడిపాడిన కథానాయిక కాజల్ అగర్వాల్. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ.. ఇలా అందరితోనూ కాజల్ జోడీ కట్టింది. అంతేగాకుండా.. సీనియర్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవితోనూ కలిసి నటించింది. అలాగే తమిళంలోనూ విజయ్, సూర్య, అజిత్ వంటి టాప్ హీరోలతో ఈ ముద్దుగుమ్మ సందడి చేసింది. ఇప్పుడు తమిళ చిత్రం ‘పారిస్ పారిస్’(బాలీవుడ్ ‘క్వీన్’ చిత్రం రీమేక్)లో మెయిన్ లీడ్‌గా నటిస్తుంది. అలాగే తెలుగులో కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో అతిథి పాత్రలో నటించనుందట కాజల్. గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో ‘చందమామ, గోవిందుడు అందరివాడేలే’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆ అనుబంధంతో కృష్ణవంశీ అడగ్గానే అతిథి పాత్రలో నటించడానికి ఎస్ చెప్పిందట ఈ పంజాబీ చందమామ. అంతే కాకుండా రజనీకాంత్, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రంలోనూ హీరోయిన్‌గా నటించనుందని సినీ వర్గాలంటున్నాయి మరి. 

English Title
In the role of a guest ..
Related News