రైతుబంధు దేశానికే ఆదర్శం

Updated By ManamWed, 05/16/2018 - 01:51
mp-kavitha
  • ఈ పథకంతో సాగు బలో పేతం.. గ్రామాభివృద్ధికి రూ.6 కోట్ల నిధులు

  • త్వరలో పనులు ప్రారంభం: కవిత.. బాల్కొండలో చెక్కుల పంపిణీ

mp-kavitha1హైదరాబాద్: వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని ఎంపీ కవిత కొనియాడారు. ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు ఏటా రూ.8 వేలు రైతన్నకు అందజేయనున్నట్లు ఎంపీ వివరించారు. వచ్చే ఎన్నికలలో దేశంలోని రైతులంతా రైతుబంధు పథకంలాంటి సంక్షేమ పథకాన్ని తమ రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టాలంటూ అక్కడి నాయకులను నిలదీస్తారని జోస్యం చెప్పారు. ఈమేరకు బాల్కొండ నియోజకవర్గం వేల్పూరు మండలం అంకుశాపూర్‌లో జరిగిన రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమా నికి ఎంపీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రా ష్ట్రంలో ప్రతి గ్రామాని కి రూ.6 కోట్లకు పైగా నిధులు వెచ్చించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సర్కా రు చేపడుతోందని వివరిం చారు. ఈ నిధులను ప్రభుత్వం విడుద ల చేసిందని, త్వరలో గ్రామాల్లో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. పరిపాలనను ప్రజల వద్దకే చేర్చిన సీఎం కేసీఆర్.. ప్రజల సొమ్మును కూడా ప్రజల వద్దకే చేర్చుతున్నారని వివరించారు. కాగా, ఈ కార్యక్రమంలో ఎంపీ కవిత 450 మంది రైతులకు రైతు బందు పెట్టుబడి చెక్కులు, పాసు పుస్తకాలను పంపిణీ చేశారు.

నేలపైనే కూర్చుని..
రైతు బంధు కార్యక్రమానికి హాజరైన మహిళలతో మాట్లాడుతూ వేదిక పైన కూర్చున్న ఎంపీ కవిత కిందికి దిగి వచ్చి వారి పక్కనే కూర్చున్నారు. దీంతో సభకు హాజరైన మహిళలు సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. తమ అభిమాన నేత పక్కనే వచ్చి కూచోవడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఈ అపురూప క్షణాలను పదిలపరుచుకోవ డానికి పలువురు సెల్ఫీలు తీసుకున్నారు. సెల్ఫీల కోసం మహిళలు పోటీపడడంతో ఎంపీ కవిత తానే సెల్ఫీలు తీసిచ్చారు. అనంతరం కూరగాయలతో చేసిన దండను ఎంపీ కవిత మెడలో వేసి స్థానిక మహిళలు తమ ప్రేమాభిమానాలను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.

Tags
English Title
The Rise of the Farmer
Related News