తేరుకున్న ముంబై

Updated By ManamWed, 07/11/2018 - 23:35
Mumbai
  • తెరపినిచ్చిన వాన.. యథావిధిగా జనజీవనం

  • లోకల్ రైలు సర్వీసులు పునరుద్ధరణ

mumbaiముంబై: భారీ వర్షాలతో అతలాకుతలమైన ముంబై బుధవారం కాసింత తేరు కుంది. పది రోజులపాటు  కురుస్తు న్న వర్షాలు కాస్త తెరిపి నివ్వడంతో ప్రజలు కాసింత ఊపిరిపీల్చుకున్నా రు. అయినా.. పలుచోట్ల వరద నీటి నష్టాలు ప్రజలను వెంటా డాయి. అనేక లోతట్టు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. వర్షాలు తగ్గుముఖం పడటంతో లోకల్ రైళ్లను పునరుద ్ధరించారు. మిగతా ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ పునరుద్ధరణ జరిగింది. ముంబై జీవ నాడిగా వ్యవహరించే నల్లాస్‌పారా-విరార్ స్టేషన్ల మధ్య రైళ్లు పున రుద్ధరించడంతో ఉద్యోగులు విధులకు యధావిధిగా హాజరయ్యారు. మిగతాప్రాంతాల్లోనూ రైలు సర్వీసులను ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. కాగా, వరద నీటిలో నిలిచిపోయిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్, వడోదర ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని సుమారు 2వేల మంది ప్రయాణికులను ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక, నౌకాదళ బృందాలు సంయుక్తంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Tags
English Title
The revived Mumbai
Related News