స్పీకర్‌, రేవంత్‌ మధ్య వాగ్వాదం

Updated By ManamMon, 06/11/2018 - 15:05
Congress leader Revanth reddy, Janareddy, Speaker Madhusudana chary

Congress leader Revanth reddy, Janareddy, Speaker Madhusudana charyహైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరిపై వేసిన అనర్హత వేటుపై వినతిపత్రం సమర్పించేందుకు సీఎల్పీ నేత జానారెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం స్పీకర్ మధుసూదనాచారి వద్దకు వెళ్లింది. కోర్టు తీర్పు అమలు చేయాలని కోరేందుకు కాంగ్రెస్ నేతలు వెళ్లిన సమయంలో స్పీకర్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని స్పీకర్‌ను రేవంత్ ప్రశ్నించారు. ‘పెన్ను దొంగలిస్తేనే ఉరిశిక్ష వేసినట్టు’ గా మీ వైఖరి ఉందంటూ స్పీకర్‌ను ఆయన గట్టిగా నిలదీశారు. రేవంత్ ఇలా మాట్లాడితే తాను వెళ్లిపోతానంటూ.. స్పీకర్ లేచారు. దాంతో రేవంత్‌ను జానారెడ్డి నిలువరించారు. స్పీకర్ మధుసూదనాచారిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సముదాయించారు. 

English Title
Revanth reddy slams Speaker Madhusudana chary
Related News