'కేసీఆర్ పతనానికి పునాదులు పడ్డాయి'

Revanth Reddy, Telangana assembly elections, KCR, TRS, Kodangal 
  • ఫలితాల్లో టీఆర్ఎస్ పేకమేడలా కూలిపోవడం ఖాయం

  • కొడంగల్‌లో మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్య

కొడంగల్‌: తెలంగాణ ఎన్నికల్లో ప్రభంజనం వీచిందని.. ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పేకమేడలా కూలిపోవడం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి జోస్యం చెప్పారు. ఎన్నికల పోలింగ్‌ ముగిసిన అనంతరం కొడంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పరిపాలన లేకుండా పోయిందన్నారు. ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు సచివాలయానికి రావడం మానేశారని రేవంత్ విమర్శించారు. దీంతో రాష్ట్రంలో పరిపాలన జరగాల్సిన సచివాలయం కోమాలోకి వెళ్లిందని అన్నారు.

ప్రజలు.. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని, టీఆర్ఎస్‌కు ప్రజల్లో ఆమోదం లేకపోయినా కేసీఆర్‌ను సీఎం చేశారని రేవంత్ అన్నారు. కేసీఆర్‌కు కట్టిన పట్టాన్ని నిలబెట్టుకోలేకపోయారని  ధ్వజమెత్తారు. మోసమే పెట్టుబడిగా 52 నెలలపాటు పరిపాలన చేశారని రేవంత్ మండిపడ్డారు. ఇవాళ కేసీఆర్ పతనానికి పునాదులు పడ్డాయని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.   

సంబంధిత వార్తలు