ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకి ప్రతిస్పందన

Updated By ManamMon, 05/14/2018 - 00:48
image

ఆధునికాంతర వాదమనేది... ఓ కాంక్రీటు సిద్ధాంతం కాదు. ఓ ద్రవ - వాయురూప సంజనితమైన ఓ వ్యక్తీకరణ..
మనిషి నిశిత చాతుర్యమూ-అస్పష్ట బెంగ - లోతైన కన్నీరు- ఎంతకీ తెగని మస్తిష్క చీకటి- కలల విస్ఫోట రాశులపై జారే అడుగు. ఉండీ లేని సమాజ స్పృహల నిరాకారతనాన్ని హత్తుకోవడం. కొన్ని బలమైన కారణాలు, బలహీన ఒడంబడికలు - వీటన్నింటినీ కలిపి- తనదైన అనుభవ రహస్యాన్ని నిష్పూచీగా-నిరభ్యంత రంగా-నిజాయితీగా చెప్పగల ఓ వక్తకరణ-ఆధునికాంతర వాదం. ఇది కేవలం ఓ వ్యక్తీకరణ - సిద్ధాంతం కాదు. ఎప్పుడైతే మనం ఓ సిద్ధాంతమనే మూస ధోరణి లోకి లాగుతామో మొత్తం ఉనికే ప్రశ్నించబడుతుంది. వికృతంగా మారిపోతుంది. కళ సంపూర్ణమైన స్వేచ్ఛలోంచి రావాలి- స్వేచ్ఛ నిర్వ చించగలిగేది కాదు. ఓ అనుభవ స్పృహ - పూర్తిగా పూర్ణమైన కళాకారుడి హక్కు-ఇది ఎవరు ఎవరికీ ప్రత్యేకించి ఇచ్చేది కాదు. 

ఈ మహావిశ్వమంతా శకలాలు శకలాలుగానే ఉంది. చలనశీల గురుత్వ రహిత విస్ఫోట ఆకర్షణల వాయు కక్ష్యల్లో తిరుగుతూ.. మనిషి తన కళాసృజనలో దీనికి మించి వేరుగా లేడు. కేంద్రం నుంచి దూరమైన అస్పష్ట కక్ష్య లోనే తిరుగుతూ ఉన్నాడు. అందుకే సృష్టి నిర్మాణంలోంచి కళాకారుడూ వేరుకాదు. దీనికి ప్రత్యేకించి వేరే సూత్రీకరణలు అవసరం లేదు. 
   
స్వతంత్ర ప్రతిపత్తి అనేది ఓ రచయితా-కవికి లోపల ఉండే తత్వగుణం. అతను సృష్టించే పాత్రలు అంతకు మించి వేరు కాదు. అనుభవం పూర్తయ్యాక ఆశ్చర్యాలు ప్రతి మనిషిలోనూ ఓ సత్యభాగమే. అతని రచనా మినహాయింపు కాదు. పాతవీ- కొత్తవైనా ఘనరూపం పొందిన సిద్ధాంత ప్రతిపాదనల్ని స్పష్టంగా బద్దలు కొట్టే వ్యక్తీకరణే ఆధునికానంతరవాదం. ఈ వ్యక్తీకరణని తిరిగి ఎవరికి వారు మళ్లీ సిద్ధాంతం చేసి- ఘనరూపాన్ని ఆపాదిస్తే మళ్లీ ఆ వాదానికి అన్యాయం చేయడమే అవుతుంది. నిజానికి పాత్రలూ- వాటి అనిర్ణయ తిరుగుబాట్లు- ప్రవర్తనలు అన్నీ ఆయా రచ యితల వెన్నులోంచి, చెమట లోంచి, మరిగే రక్తంలోంచీ వచ్చేవే... వాటికి మళ్లీ కొన్ని కొత్త ప్రక్రియల పేర్లని తగి లించి సిద్ధాంతం చెయ్యడమనేది అన్యాయం ఆధునికాంతరవాద వ్యక్తీకరణ. ఇప్పటికే ఆధునికాంతర వాదం పట్ల పూర్తిగా లేని ఆదరణ, అపోహలు పూర్తిగా అర్థంకాని అయోమయం; ఆ కారణంగా కళాకారుడి రచనలపై చూపించే ధర్మాగ్ర హాలతో యుద్ధం చేసుకొంటూ వెళ్లే ఈ సంధి పరిణామా న్ని.. ప్రవహిస్తున్న సత్యాన్ని.. ఖచ్చిత నిర్వచనాలతో కూడిన సిద్ధాంతంగా మార్చి... ఈ వ్యక్తీకరణ స్వేచ్ఛకి అడ్డుపడి అన్యాయం చేయకూడదని నా ఆందోళన.

అసలు వస్తు- శిల్పాలు, సత్యమూ-కల, భయ మూ-మృత్యువు-ప్రేమ-అభద్రత, బతకడమూ- జీవిం చడమూ, రాయడమూ-శ్వాస వినిర్మాణంలో ఈద డమూ అన్నీ కలగలసిపోతున్న ఒక సందిగ్ధ స్వేచ్ఛ లోంచి... ఓ శోషిత తాపనవాక్యం కావాలిప్పుడు. అందుకే ఎంతో కష్టపడి కూలుస్తున్న గోడల్నీ, ఆ గోడల్ని కూల్చికూల్చి అలసి వెళ్ళిపోయిన రచయిత, కవుల్నీ ఒక్కసారి మనలో స్మృతిచిహ్నంగా నింపుకొన్నా.మళ్లీ మరోమారు ఇలాంటి ప్రమాదకర (సాహత్యా నికి) పదజాలాల వైపు వెళ్లం అనుకొంటా.
       
నిజానికి ఇప్పుడు విమర్శకి కొత్తస్వేచ్ఛ... కొత్త వ్యక్తీకరణ-కొత్త పదాలు-కొత్త దృష్టి. అస్పష్ట సంయ మనం వెదుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా సాగర్ గారి సృష్టి సాగుతుందని ఆశిస్తాను.
 
 బి.ఎస్.ఎం. కుమార్

English Title
Response to crystals
Related News