మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రిలయన్స్ రికార్డు

Updated By ManamThu, 07/12/2018 - 23:11
mikesh

mikesh ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ 100 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ స్థాయిని అందుకున్న రెండవ భారతీయ కంపెనీగా గురువారం పరిణమించింది. దేశంలోని అతి పెద్ద సాఫ్ట్‌వేర్ సర్వీసుల ఎగుమతి సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ 100 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ వైులురాయిని నెలకొల్పిన మొదటి భారతీయ కంపెనీగా ఏప్రిల్‌లో అవతరించింది. గత వారం నిర్వహించిన షేర్‌హోల్డర్ల వార్షిక సర్వ సభ్య సమావేశంలో ప్రకటించిన సమరశీల వ్యాపార విస్తరణ పథకంతో ఆర్.ఐ.ఎల్ షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 1091ని తాకాయి. అది జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుండడం కూడా ధర పెరుగుదలకు దోహదపడింది. ఆర్.ఐ.ఎల్ షేర్లు గురువారం వరుసగా ఐదవ సెషన్‌లోనూ పెరుగుదలను చూశాయి. రూ. 1043.15 వద్ద మొదలైన షేర్ ధర గత ముగింపు ధరకన్నా 5.27 శాతం పెరుగుదలను కనబరుస్తూ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 1091ని తాకింది. షేర్ ధర పెరగడంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (మొత్తం షేర్ల సంఖ్యతో షేర్ విలువను గుణించగా వచ్చే మొత్తం)  రూ. 6,88,513.11 కోట్లను (దాదాపు 100 బిలియన్ డాలర్లు) తాకింది. ఎన్.ఎస్.ఇలో కూడా రిలయన్స్ షేర్ ధర రూ. 1944.35 వద్ద మొదలై, 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 1091ని తాకింది. ఉచిత వాయిస్ కాల్స్, కారు చౌకకి డాటాతో మొబైల్ టెలిఫోనీ మార్కెట్‌ను ఒక కుదుపు కుదిపిన ఆర్.ఐ.ఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ గృహాలు, సంస్థలకు అల్ట్రా హై స్పీడ్ ఫిక్సెడ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు గత వారం ప్రకటించారు. కంపెనీ 41వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ముకేశ్ ప్రసంగించారు. ఈ సర్వీసు టెలివిజన్‌పై అల్ట్రా హై డెఫినిషన్ ఎంటర్‌టైన్‌మెంట్, వాయిస్ యాక్టివేటెడ్ అసిస్టెన్స్, వర్చువల్ రియాలిటీ గేమింగ్, డిజిటల్ షాపింగ్, స్మార్ట్ హోమ్ సొల్యూషన్లను సమకూరుస్తుందని ఆయన వెల్లడించారు. చమురు, ఇంధన వాయువు నుంచి టెలికాం వరకు భిన్న రంగాల్లో ఉన్న ఈ సమ్మేళన సంస్థ 100 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటైలెజేషన్ వైులురాయిని 2007 అక్టోబర్‌లో మొదటిసారి అధిగమించింది. అప్పట్లో అవెురికన్ డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 39.5గా ఉంది. రూపాయిల్లో కంపెనీ మార్కెట్ క్యాపిటలేజేషన్ అప్పట్లో రూ. 4.11 లక్షల కోట్లుగా ఉంది. ఆర్.ఐ.ఎల్ షేర్ గతిని పరిశీలిస్తున్న 38 విశ్లేషణా సంస్థల్లో 28 సంస్థలు రిలయన్స్ షేర్లను ఇప్పటికీ కొనమని చెబుతున్నాయి. లేదా హెచ్చు రేటింగ్ ఇస్తున్నాయని చెప్పవచ్చు. ఐదు సంస్థలు షేర్లను ‘‘అట్టేపెట్టుకొమ్మని’’ సిఫార్సు చేస్తున్నాయి. మిగిలిన ఐదు సంస్థలు ‘‘విక్రయించమని’’ సిఫార్సు చేస్తున్నాయి. లేదా తక్కువ రేటింగ్ ఇస్తున్నాయి.

English Title
Reliance record in market capitalization
Related News