‘మణికర్ణిక’ రాకకు ముహూర్తం ఖరారు

Updated By ManamSat, 07/21/2018 - 11:27
Manikarnika

Manikarnika వీరనారి ఝాన్సీ రాణి లక్ష్మీభాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మణికర్ణిక- ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. క్రిష్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించింది. కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రానికి విడుదల తేది ఖరారైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2019 జనవరి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. మామాలుగా ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినప్పటికీ.. గ్రాఫిక్స్ కారణంగా ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. తెలుగు, హిందీలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, కమల్ జైన్ సంయుక్తంగా నిర్మించారు.

English Title
Released date confirm gor Manikarnika
Related News