వరుణ్ తేజ్ మూవీకి రిలీజ్ డేట్ ఫిక్స్

Updated By ManamThu, 07/12/2018 - 16:49
varun tej

varun tej వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రానికి విడుదల తేది ఖరారు అయింది. డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇక అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ సరసన అదితీరావ్ హైదారీ, లావణ్య త్రిపాఠి నటించనున్నారు. సత్యదేవ్, రాజా, అవసరాల శ్రీనివాస్, రెహ్మాన్ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి అహం బ్రహ్మాస్మి అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు సమాచారం.

English Title
Release date fix for Varun Tej movie
Related News