ఫిబ్రవరిలో రానున్న తమిళ ‘అర్జున్ రెడ్డి’

Varma

తెలుగులో ఘన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ ‘వర్మ’ పేరుతో తమిళ్‌లో రీమేక్ అయిన విషయం తెలిసిందే. జాతీయ అవార్డు గ్రహీత బాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. బెంగాల్ మోడల్ మేఘా హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి విడుదల తేదిని ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఫిబ్రవరిలో వర్మ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మూవీ యూనిట్ వెల్లడించింది. మరి తెలుగులో విజయ్ దేవరకొండకు మంచి విజయం అందించిన అర్జున్ రెడ్డి.. తమిళంలో వర్మకు ఏ మేరకు విజయాన్ని ఇస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు