దళితుల ఆందోళనలకు ‘ప్రతిబింబం’ 

Updated By ManamFri, 08/10/2018 - 01:13
mathanam

imageపేరులో ‘సుప్రీమ్’ అని ఉన్నంత మాత్రాన రాజ్యాంగ పరిధిలో సుప్రీంకోర్టును అత్యంత ఉన్నతైవెునదని చెప్పలేదు. అలాగే పార్లమెంటే ఉన్నతైవెునదనే బ్రిటిష్ విధానాన్ని మనం అంగీకరించలేదు. అన్నిటినీ మించి రాజ్యాంగమే సమున్నదైవెునది. అందులో చెప్పినట్లుగా అధికార యంత్రాంగ పరిధి నిర్ణయమై ఉన్నది. రాజ్యాంగం నిర్వచించిన ప్రకారమే ఏ అధికార యంత్రాగైమెనా బద్ధురాలు కావలసిందే. షాబానో, వొడాఫోన్, శత్రువుల ఆస్తులు, జల్లికట్టు, ఎఎంయూ వైునారిటీ విధానం వంటి వాటిపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఎన్నో కీలక కేసులను పార్లమెంట్ తోసిపుచ్చింది. దొరైరాజన్ (1950) కేసులో మద్రాసులో మతరిజర్వేషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో పార్లమెంటులో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేశారు. అలాగే, సుప్రీం కోర్టు ఇచ్చిన పలుతీర్పులను తిరస్కరిస్తూ అనేక రాజ్యాంగ సవరణలు చేశారు. వాటిలో ప్రమోషన్లలో రిజర్వేషన్లు అంశం కూడా ఉన్నది. 

మార్చి 20న ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచారం చట్టంపై సుప్రీం కోర్టు తీర్పుచెబుతూ, ప్రాథమిక దర్యాప్తు లేకుండా ఎవరిమీ దా దర్యాప్తు అదికారి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయరాదని, సం బంధిత అధికారి అనుమతి లేకుండా ఎవరినీ అరెస్టు చేయరాదని, నిందితుడికి ముందస్తు బెయిల్ పొందేందుకు అర్హుడని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

అయితే, ఎస్‌సీ, ఎస్‌టీ వేధింపుల చట్టానిన లోక్‌సభ సవరిస్తూ సెక్షన్ 18ఎ అనే కొత్త క్లాజును చేర్చుతూ సవరణనుimage తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు అంశాలే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం, అరెస్టుకు సంబంధించిన అంశాలకు సం బంధించి సుప్రీంకోర్టు తీర్పును తోసిపుచ్చుతూ ఈ సెక్షన్‌ను చేర్చింది. ఎస్‌సీ, ఎస్‌టీ బిల్లు ప్రత్యేకైవెునదని ఎస్‌సీ, ఎస్‌టీ 1989 చట్టంలో స్పష్టంగా ఉన్నది. అయితే, ఈ తీర్పునూ తేలి గ్గా పార్లమెంట్ దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. ఈ బిల్లుపై పార్లమెంట్ మరింతగా చర్యలు చేపట్టవలసి ఉంది. తీర్పునకు ఆధారైమెన ముఖ్య అంశాలను పార్లమెంటు పరిశీలించి రద్దుచేయాల్సి ఉన్నది. 1987లో ఉత్కళ్ కాంట్రాక్టర్ల కేసులో సం బంధిత చట్టాలకు లోబడి తీర్పులను చట్టసభలు సవరించవచ్చునని అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. 

ప్రస్తుతం బిల్లులోని ప్రధాన అంశాలను పార్లమెంట్ తొలగించరాదని సుప్రీంకోర్టు చెప్పడానికి ఉన్న ఆధారాలేమిటి? గతంలో కొన్ని హైకోర్టులు ఇచ్చిన తీర్పులను పక్కకు పెట్టి గత మూడు దశాబ్దాలుగా ఎస్‌సీ, ఎస్‌టీ బిల్లు అమలు తీరు ను పరిశీలించామని, అమలులో లోపాలను గమనించామని జస్టిస్ గోయెల్, జస్టిస్ లలిత్ అభిప్రాయపడ్డారు. న్యాయస్థానం తీర్పులు ప్రామాణిక అనుభావిక పరిశోధనలకు ప్రత్యామ్నాయం కాబోవని బిల్లులో స్పష్టం చేసివుండాల్సింది. న్యాయస్థానం దృష్టికి రాని అంశాలు, కారణాల్లోని వాస్తవ కారణాలను కూడా బిల్లులో చేర్చివుండాల్సింది. 

బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడుతూ మంత్రి, ఎస్‌సీ, ఎస్ టీ చట్టం కేవలం 12 శాతం కేసుల్లో మాత్రమే తప్పుపట్టేందు కు అవకాశం కల్పించిందని అంగీకరించారు. వేధింపులపై శిక్ష ల అమలు స్థాయిలో తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తోందని మంత్రి ప్రకటించి ఉండాల్సింది. వాస్తవానికి 2009-15 మధ్యకాలంలో దోషుల నిర్ధారణ సంఖ్య తగ్గిందని ఎన్‌ఆర్‌సీబీ వివరాలు తెలియజేస్తున్నాయి. ఇలాంటి కారణాల వల్ల తప్పుడు సంకేతాలకు దారితీసిందని భావించాల్సి వస్తోంది. ఏదేైమెనా ఈ చట్ట పరిధిలోని శిక్షలను ద్వేషపూరిత చర్యలకు విధించే సాధారణ నేరాలతో పోల్చడం దారుణం, హేయం. 

కేవలం ముందస్తు బెయిల్‌కు మాత్రమే ఈ చట్టం ఉం దని ఏ న్యాయస్థానం తీర్పులకుగానీ, ఆదేశాలకుగానీ కట్టుబ డి లేదని స్పష్టీకరించకపోవడంతో ఈ బిల్లు లోపభూయిష్టవైునదని భావించాల్సిందే. రాజ్యాంగంలోని 21వ అధికరణం మేరకు ప్రతి పౌరుడి స్వేచ్ఛకు రక్షణ కల్పించడం న్యాయస్థానాల బాధ్యత అని జస్టిస్ గోయెుల్ వ్యాఖ్యానించగా, ముం దస్తు బెయిల్ అనేది ప్రాథమిక హక్కుకాదని బిల్లు చెబుతోం ది. 1973లో రూపొందించిన కొత్త సీఆర్‌పీసీ ప్రకారం అది కేవలం చట్టబద్ధైమెన హక్కు మాత్రవేునని మంత్రి బిల్లులో చెప్పారు. ఏదేమైనప్పటికీ ఇది మినహాయింపుమాత్రవేుగానీ, నిబంధన కాదు. సాధారణ నేరాల్లో కూడా దీన్ని అనేక రాష్ట్రా లు అనుసరించడం లేదు.

న్యాయస్థానాలకు శాసనాధికారాలు ఉండవని, తమకున్న ప్రత్యేక అధికారాలను గౌరవించక తప్పదని బిల్లులో క్రోడీకరించి ఉండాల్సింది. శాసనపరైమెన లోపాలున్నప్పుడు మాత్ర మే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంటుం ది. ఉదాహరణకు లైంగిక వేధింపులు, ఖాప్ పంచాయితీలు, మూక చిత్రవధలు వంటి అంశాల్లో మార్గదర్శకాలను రూపొం దించే హక్కు న్యాయస్థానాలకు ఉంటుంది. అయితే పార్లమెం టరీ చట్టపరిధిలోకి వచ్చేసరికి చట్టానికి రాజ్యాంగబద్ధత ఉన్నదాలేదా అనే అంశాన్ని మాత్రమే న్యాయస్థానం పరిశీలించాలి. చట్టంలోని సారాంశాన్ని మాత్రమే పరిశీలించాల్సి ఉంటుంది. తప్పుడు కేసుల విషయంలో న్యాయస్థానం ఆందోళనను బిల్లు లో ప్రస్తావించి ఉండాల్సింది. 

ఈ విధంగా అన్యమనస్కంగా ఈ బిల్లు ఉందంటూ దళితుల ఆందోళనకు అద్దం పడుతోంది. ఈ అంశంలో సర్వోన్న త న్యాయస్థానం అభిప్రాయాన్ని తొలగించడంలో ఈ బిల్లు విఫలైమెందనే చెప్పుకోవాలి. ఫలితంగా ఈ బిల్లును మొండిైవెఖరితో రూపొందించనదిగా భావించి సుప్రీంకోర్టు తిరస్కరించే అవకాశమున్నది. తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చేందుకు న్యాయవిభాగం అభిప్రాయం తీసుకోవాలని ప్రతిపక్షం చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చడం శోచనీయం. ఇందుకు బహుశా 2019 ఎన్నికల్లో అగ్రకులాల ఓట్లు పోతాయన్న భయం కావచ్చు. 

- ఫైజన్ ముస్తాఫా
(ద ట్రిబ్యూన్)

English Title
'Reflection' for Dalit concerns
Related News