గొద్రేజ్ ప్రాపర్టీస్‌కు తగ్గిన రుణ భారం

Updated By ManamThu, 11/08/2018 - 23:03
Godrej

Godrejన్యూఢిల్లీ: రియాల్టి దిగ్గజం గొద్రేజ్ ప్రాపర్టీస్ ఏడాది కాలంలో గణంగా రుణ భారాన్ని తగ్గించుకుంది. అమ్మకాల్లో వృద్ధి, బుకింగ్స్ పెరగటంతో ఇది సాధ్యపడిందని  గొద్రేజ్ వెల్లడించింది. కాగా, గత ఏడాది(2017)లో రూ.1,137 కోట్లుగా ఉన్న గొద్రేజ్ ప్రాపర్టీస్ రుణం 2018 సెప్టెంబర్ 30 నాటికి 51 శాతం తగ్గి రూ. 1,539కి చేరింది. ముంబై కేంద్రంగా పని చేస్తున్న గొద్రేజ్ ప్రాపర్టీస్ అమ్మకాలు, బుకింగ్స్‌లో మంచి వృద్ధి ఉన్నప్పటికీ ప్రాపర్టీ మార్కెట్‌లో మాత్రం కొద్దిగా వెనకబడినట్లు ఆ సంస్థ తెలిపింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ. 5,083 కోట్ల బుక్సింగ్స్‌ను సాధించగా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో మాత్రం రూ. 1,627 కోట్ల బుకింగ్స్‌తో 42 శాతం తగ్గుదలను నమోదు చేసింది. ‘‘మేము గొద్రేజ్ ప్రాపర్టీస్‌లో మునుపెన్నడూ లేనంత ఎక్కువగా అమ్మకాలను సాధించాం’’ అని గొద్రేజ్ ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పిరోజ్ షా అన్నారు. గొద్రేజ్ ప్రాపర్టీస్‌కు ప్రధాన మార్కెట్లైన ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం, ముంబై, బెంగళూరు, పుణెల పై దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా కంపెనీ ఇటీవల ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలికాల్లో కూడా రూ. 20.57 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. మొత్తం ఆధాయం రూ. 487.07 కోట్లుగా కంపెనీ వెల్లడించింది.

Tags
English Title
Reduced debt burden to Godrej Properties
Related News