మళ్లీ తెరైపెకి ‘రామారావుగారు’?

Updated By ManamThu, 09/20/2018 - 01:30
balakrishna

imageనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఆయన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ‘యన్.టి.ఆర్’ను రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ ఏ సినిమా చేయబోతారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. వినాయక్ బాలకృష్ణ కోసం కథను సిద్ధం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తారని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం అనిల్ రావిపూడి ‘ఎఫ్ 2’ సినిమాను పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత బాలయ్య, అనిల్ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే ఇదే కాంబినేషన్‌లో గతంలో ‘రామారావుగారు’ అనే సినిమా స్టార్ట్ అవుతుందనే వార్తలు వినిపించాయి. కానీ ఆ సినిమా మెటీరియైలెజ్ కాలేదు. మళ్లీ ఇపుడు ఆ సినిమా పట్టాలెక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు. 

English Title
reappear again
Related News