రాజ్యం బలవంతుని స్వార్థం!

Updated By ManamFri, 11/09/2018 - 03:00
kingdom is selfish

image‘రాజ్యం బలవంతుని స్వార్థం’ అని అప్పుడెప్పుడో.. ప్రముఖ ఆర్థికవేత్త కారల్‌మార్క్స్ చెప్పారు. అప్పట్లో ముఖ్యంగా రాజరికపు వ్యవస్థ వున్న దేశాలకు ఈ వా క్యం పూర్తిగా వర్తించేది. కాలం మారుతున్నది. ఆధు నిక ప్రపంచం వైపు అందరూ అడుగులు వేస్తున్నారు. సాంకేతిక ఫలాలు అందరి చేతుల్లోకి రావడంతో మొ త్తం ప్రపంచం కుగ్రామంగా మారింది. అయితే ఇదే సందర్భంలో పాలకులు పక్షపాతానికి పెద్దపీట వేస్తూ నాయకులు వినాయకులుగా మారడంతో ఈ వ్యవస్థ ఎటు వైపు పోతున్నదోనని అయోమయం నెలకొన్నది.

నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన ఎన్నికల జాతరను, వచ్చే యేడాది ఏప్రిల్‌లో దేశ వ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికలకు సంబం ధించి ఇప్పటినుంచే రచిస్తున్న వ్యూహ ప్రతివ్యూ హాలను చూస్తుంటే... నిజంగా నాటి కారల్‌మార్క్స్ సూక్తిని అందరూ మననం చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి పది నెలలు గడువు వున్నప్పటికీ కేవలం రాజకీయ స్వలాభం కోసం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు నగార మోగించారు. టీఆర్‌ఎస్ పార్టీ త యారు చేసిన మ్యానిఫెస్టో, కాంగ్రెస్ నాయకులు ఎప్పటినుంచీనో చెబుతున్న హామీల లిస్ట్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు తయారు చేసిన మ్యానిఫెస్టో చూస్తుంటే, వీరి కంటే వారు ఘనులు అనే విధంగా ఆచరణ సాధ్యం కాని మాటల మూటలను చూసి నవ్వాలో... ఏడవాలో... తెలియని దుస్థితి ఏర్పడింది. బీజేపీ నాయకులు ప్రతినెలా ఇంటిబాడుగ చెల్లిస్తా మంటున్నారు. పైగా ఆఫీస్ కార్యాలయాల తరహాలో బ్రాందీ షాపులు తెరిపిస్తామని చెబుతున్నారు. ఆ బ్రాందీ షాపులే లేకుండా చేయడానికి ఆలోచించడం లేదు. టీఆర్‌ఎస్ గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో ఒకటైన రైతుల రుణమాఫీ హామీని అతి కష్టం మీద విడతల వారీగా మూడు సంవత్సరాలకు నెరవేర్చారు. మళ్లీ కొత్తగా లక్ష రూపాయలు రుణాన్ని మాఫీ చేస్తామని చెబుతున్నారు.

  అంటే... కాంగ్రెస్ పాలకులు రెండు లక్షలు మాఫీ చేస్తామని చెబుతుం డడంతో వీరు కూడా అదే తరహాలో తాజాగా రూపొందించిన పాక్షిక మ్యానిఫెస్టోలో వివరించారు. టీఆర్‌ఎస్. ఇచ్చిన గత హామీలనందు 80% నెరవేర లేదు. ఇంటికో ఉద్యోగం, ఇంటింటికీ నల్లా నీరు, డబుల్ బెడ్ రూమ్స్ ఏర్పాటు, పేద దళితులకు ఒక్కొక్క కుటుంబానికి మూడెకరాల భూమి వంటివి ఏమాత్రం నెరవేరాయో... అందరికీ తెలిసిందే. కాళే శ్వరం ప్రాజెక్ట్ నీటిని ఆగస్ట్‌లో అందిస్తామని చెప్పారు. వచ్చే ఆగస్ట్‌కయినా వస్తాయో లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది. సహజంగా ప్రతి ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ లేదా జనతా దర్బార్‌ల పేర్లతో ప్రతిరోజు వారంలో నాలుగైదు రోజులు నగరంలో వున్నప్పుడు నేరుగా ప్రజలనుంచి ఫిర్యాదులు స్వీకరించే పద్ధతిని అవలంబిస్తుంటారు. ఈ ముఖ్యమంత్రి అటువంటి పద్ధతికి స్వస్తి చెప్పడమేగాక చివరకు మంత్రులకు, ఎమ్మెల్యేలకు సైతం అపాయింట్‌మెంట్స్ అతి కష్టంగా ఇచ్చేవారు. ఏదో వాస్తు దోషం పేరుతో సెక్రటేరి య ట్‌కే రాకుండా పూర్తిగా క్యాంపాఫీస్ నుంచీనే నవా బులు పాలన సాగించినట్లుగా ఈ నాలుగున్నర ఏళ్లు గడిపేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి కేవలం నాలుగైదు శాతం ఓట్లకు కక్కు ర్తి పడుతూ టీడీపీతో పాటు ఇతర పార్టీల నాయకులతో పొత్తుకోసం వెంపర్లాడుతూ.. మహా కూటమి పేరుతో ఏవో మాయోపాయాలు చేస్తున్నారు. ఈ కూటమి నాయకులు అప్పుడే అధికారంలోకి వచ్చేసినట్లుగా మాకు ముఖ్యమంత్రి, మీకు ఉప ము ఖ్యమంత్రి పదవులు అని బేరాలాడుతూ అనైతికంగా వ్యవహరిస్తున్నారు. పైగా ఒక ఇంటిలోనే భార్యా భర్తలు, కుమార్తె, కుమారులు లేదా వియ్యంకులు, సోదరులు తదితరుల బంధుసపరివారానికి టిక్కె ట్లు కావాలని కుస్తీపడుతున్నారు. గతంలో  కాంగ్రెస్ నా యకులు ఏం వెలగబెట్టారో... ఇంకా ఎవరూ మరిచి పోలేదు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఊదరగొడుతు న్నారు. వీన్నింటికంటే ముఖ్యంగా టీఆర్‌ఎస్. తాజా మ్యానిఫెస్టోలో నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి 3,116/ రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 

ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల సమయంలో చంద్రబాబు... బాబు వస్తే జాబు వస్తుందని విరివిగా ప్రచారం చేశారు. ఇందులో భాగంగా నిరుద్యోగ భృతి కల్పిస్తామని అప్పుడు హామీ ఇచ్చారు.  నాలుగున్నర సంవత్సరాలు ఆ హామీని మరచిపోయి ఇప్పుడు ఎన్ని కలు సమీపిస్తున్నందున కొంతమంది యువకులకు నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వడానికి ముందుకొ చ్చారు. దాని ద్వారా అతనికి ఏదో మంచిపేరు వసు ్తన్నదని కేసీఆర్, ఇప్పుడు తెలంగాణలో కూడా మూ డువేల నూటపదహార్లు చెల్లించడానికి హామీ ఇచ్చారు.  ఇలాగే చంద్రబాబు అన్న క్యాంటీన్‌ల పేరుతో అయి దు రూపాయలకే భోజనం అందిస్తున్నారు. ఇదే ఆం ధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి తన పాద యాత్రలో రోజుకో పది హామీలు ఇస్తూ పోతున్నారు. ఈ ఏడాదిలో ఆ హామీల జాబితా వందకు పైబడి వుంటుంది. ఈ విధంగా దూరదృష్టి, వాస్తవికతలను ఆలోచించకుండా ఎటుతిరిగి అధికారంలోకి రావాలి! మళ్లీ మళ్లీ పదవులు అనుభవించాలి అనే అత్యాశతో, దుర్బుద్ధితో నేటి నాయకులు వ్యవహరిస్తున్నారు. ఇందుకు అన్ని పార్టీల నాయకులు తిలా పాపం తలా పిడికెడు అనే విధంగా రాజకీయ వ్యవస్థను, సామా జిక వ్యవస్థను భ్రష్ఠు పట్టిస్తున్నారు. వీరి దృష్టిలో ప్రజలు పేరాశవాదులు. ఇంకా చెప్పాలంటే.... వారిని భిక్షగాళ్లుగా మారుస్తున్నారు. యావన్మంది ప్రజలను చైతన్య వంతులను చేసి వారంతకు వారే స్వయం ఉత్పాదక శక్తులుగా ఎదిగేటట్లు చేసి సమసమాజ స్థాపన తీసుకురావా లనేది ఇక మున్ముందు దాదాపు అసాధ్యం. అందుకే ఇటువంటి బలవంతుల, ధనవం తుల స్వార్థానికి రాజ్యం, ప్రజలు బలవుతున్నారని మరోసారి ఘంటా పథంగా చెప్పడమైనది. 
 
- తిప్పినేని రామదాసప్పనాయుడు
 99898 18212

 

English Title
The realm of the kingdom is selfish!
Related News