నెలాఖరున రియల్ దండుపాళ్యం

Updated By ManamThu, 07/05/2018 - 15:46
Real Dandupalyam
Real Dandupalyam

కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది ప్రధాన పాత్ర పోషించిన రియల్ దండుపాళ్యం ఈ నెలఖారున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీ వైష్ణోదేవి మూవీస్ పతాకంపై నారాయణ భట్ సమర్పణలో 'రియల్  దండుపాళ్యం' తెరకెక్కింది. మహేష్ దర్శకత్వంలో కన్నడ ఫేమ్స్ రాగిణీ ద్విగేది, మేఘన రాజ్, దీప్తి, ప్రథమ ప్రసాద్, సంయుక్త హొర్నాడ్ లు నటించగా, సి. పుట్టు స్వామి నిర్మాతగా వ్యవహరించారు. 

ఈ సందర్భంగా నిర్మాత పుట్టు స్వామి మాట్లాడుతూ.. "తెలుగులో ఇదివరకే మూడు సినిమాలు చేశాను. అన్నీ విజయవంతం అయ్యాయి. ఇప్పటి వరకు ఎవరూ చేయని డిఫరెంట్ కాన్సెప్ట్ తో డైరెక్టర్ మహేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమా పూర్తి అయ్యాక చూస్తే.. నేనే థ్రిల్  అయ్యా. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సినిమా ఎంతో అవసరం. 

కన్నడలో పెద్ద హీరోయిన్స్ కుమార్తలే ఈ సినిమాలో నటించిన నలుగురు హీరోయిన్స్. చాలా బాగా నటించారు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే చట్ట పరంగా ఏర్పడిన చర్యను వారు ఎలా ఎదుర్కొన్నారు అనేదే ఈ రియల్ దండుపాళ్యం కాన్సెప్ట్. మంచి సందేశాత్మక చిత్రం. ప్రస్తుతం సెన్సార్ తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. తెలుగు, కన్నడ భాషల్లో ఈ నెలాఖరున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అందరికీ నచ్చే చిత్రమవుతుందని ఆశిస్తున్నాను.." అన్నారు. 

రాగిణి ద్వివేది, మేఘన రాజ్, దీప్తి, ప్రధమ ప్రసాద్, సంయుక్త హర్నడ్, యువరాజ్, రఘు బట్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీధర్. వి. సభ్రం, మాటలు-పాటలు: భారతీ బాబు, పివి ఎల్ ఎన్ మూర్తి, నిర్మాత: సి. పుట్టు స్వామి, డైరెక్టర్: మహేష్

English Title
Real Dandupalyam movie release date is july ending
Related News