ఆర్.బి.ఐ ద్రవ్య విధాన ముఖ్యాంశాలు

RBI-Policy

ముంబై: దిగువ ఉన్నవి 2018-19 సంవత్సరపు ఐదో ద్వైమాసిక ద్రవ్య విధాన ప్రకటనలోని ముఖ్యాంశాలు:

 •     ఆర్.బి.ఐ కీలక వడ్డీ రేటు (రెపో) మార్చకుండా 6.5 శాతం వద్దనే ఉంచింది.
 •     రివర్స్ రెపో రేటు 6.25 శాతం, బ్యాంక్ రేటు 6.75 శాతం, సి.ఆర్.ఆర్ 4 శాతం వద్ద ఉన్నాయి. 
 •     అక్టోబర్-మార్చి మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం 2.7-3.2 శాతం మధ్య ఉండవచ్చని అంచనా వేసింది.
 •     ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జి.డి.పి వృద్ధి 7.4 శాతంగా ఉండగలదనే అంచనాను కొనసాగించింది. 
 •     వచ్చే 2019-20 సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో వృద్ధి 7.5 శాతంగా ఉండగలదని పేర్కొంది. దాని దిగువ గతి రిస్కులను కూడా వెల్లడించింది.
 •     దేశీయ స్థూల ఆర్థిక ప్రాథమికాంశాలను పటిష్టపరచుకునేందుకు సమ యం యుక్తంగా ఉందని చెప్పింది.
 •     ప్రైవేటు పెట్టుబడుల్లో అవకాశాలను, అనుకూల సంస్థలను సృష్టిం చేందుకు కోశ క్రమశిక్షణ ముఖ్యమని పేర్కొంది.
 •     రబీలో నాట్లు తక్కువ స్థాయిలో ఉండడం వ్యవసాయం, గ్రామీణ డిమాండ్‌పై ప్రతికూ ల ప్రభావం చూపవచ్చని అభిప్రాయపడింది. 
 •     ఫినాన్షియల్ మార్కెట్‌లో ఉత్థానపతనాలు, మందగిస్తున్న ప్రపంచ డిమాండ్, పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలను ఎగుమతులకు ఉన్న ప్రతికూల రిస్కుగా అభివర్ణించింది. 
 •     ముడి చమురు ధరల్లో క్షీణత వృద్ధి అవకాశాలను పెంపొందింపజేస్తుందని భావిస్తున్నట్లు తెలిపింది.
 •     ప్రపంచ ఫినాన్షియల్ మార్కెట్లలో వడ్డీ రేట్లు పెరుగుతున్న ధోరణి ఉన్నా రుణాల స్వీకరణ పటిష్టపడిందని చెప్పింది. 
 •     ద్రవ్య విధాన కమిటీ తదుపరి సమావేశం ఫిబ్రవరి 5-7 తేదీల్లో జరుగనుంది. 

సంబంధిత వార్తలు