ఆర్బీఐపై పెత్తనం? 

Updated By ManamFri, 11/09/2018 - 03:00
RBI

imageగత దశాబ్దకాలంగా కేంద్రీయ బ్యాంక్ (రిజర్వ్ బ్యాంక్) ఆగంతుక నిధి తరిగిపోతోంది. అయినప్పటికీ ఈ అంశంపై ఎలాంటి పారదర్శకతకు చోటు కల్పించే అవకాశం ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు ఆర్బీఐపై ఒత్తిడి తీసుకొస్తున్నారన్నది ఇప్పుడు తలెత్తే ప్రధాన ప్రశ్న. ఆర్బీ కాంటింజెన్సీ ఫండ్ విధానాన్ని క్రమాంకనం చేయాలని గానీ, మార్చాలనిగానీ ఎవరూ కోరుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రానికి, ఆర్బీఐకి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం రెండిటి మధ్య దూరాన్ని పెంచేలా ఉండడం ఆందోళన కలిగించే అంశం. అన్ని అసాధారణ అంశాలను ఈ నెల 19న జరిగే బ్యాంకు బోర్డు సమావేశంలో చర్చిస్తామని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించారు. ఈ ప్రకటన చూసిన తరువాత సమస్యపై దొడ్డిదారి చర్చలకు అవకాశం ఉంటుందని ఎవైరెనా ఊహిస్తారు. 

అయితే, పరిస్థితులు చూస్తుంటే క్షీణించే విధంగానే కనిపిస్తున్నాయి. 19న జరిగే బోర్డు సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తనకు అనుకూల మైన నిర్ణయాలు, తీర్మానాలు చేయించేలా ఆర్బీఐ గవర్నర్‌పై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ వివాదం మరింత ముదిరేలా పరిస్థితులు మరింత కఠినంగా మారే సూచనలుండడం దురదృష్టకరం. ఈ సమావేశంలో పరస్పర సంతృప్తికరైమెన పరిష్కారం లభించకపోతే దేశంలో ఆర్థికపరంగాను, మార్కెట్లలోను గడ్డుపరిస్థితులు ఎదురు కాగలవు. ఒకవేళ గవర్నర్‌పై బోర్డు ఒత్తిడి తెచ్చి తనకనుకూలైమెన తీర్మానాన్ని ముందుకు తీసుకువస్తే కొద్ది దశాబ్దాలుగా లేని చెడు సంప్రదాయానికి దారితీస్తుంది. పాలనపరైమెన అంశా ల్లో బోర్డు ఇంతవరకు ఈ విధంగా చురుైకెన పాత్ర పోషించిన దాఖలాలు లేవు. ఇదే విషయంలో ఆర్బీఐ పూర్వపు గవర్నర్ రఘురామ్ రాజన్ తీవ్రంగా హెచ్చరించారు. ఒకవేళ గవర్నర్‌పై పాలనాపరైమెన నిర్ణయాలు తీసుకురావడం తగదని ఆయన సూచించారు. ఆర్బీఐ ఏ విధంగా కాంటింజెన్సీ నిధి విధానైంపె వ్యవహరించాలో మాత్రం బోర్డు పరిశీలించవచ్చునని ఆయన చెప్పారు. ప్రస్తు త వాదోపవాదాలను పక్కనబెడితే, రిజర్వ్ బ్యాంక్ కంటింజెన్సీ ఫండ్‌పై దశాబ్దం పాటు అధ్యయనం జరిగిందని పలువురు గుర్తుచేస్తున్నారు. 

పరస్పర అనుగుణైవెున స్ఫూర్తితో ఈ ఫండ్ విషయంలో మార్పులు చేసే ప్రయత్నాలు ఎందుకు జరగలేదో ఎవరికీ అర్ధం కాని అంశం. కానీ, ఈ అంశం లో బ్యాంకులకు తిరిగిపెట్టుబడి పెట్టేందుకు 3.5 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖకు బదలాయించవలసిందిగా గవర్నర్‌ను ఆదేశిస్తూ బోర్డు నిర్ణయం తీసుకోవడం సరికాదని పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. రిజర్వ్‌బ్యాంక్ కంటింజెన్సీ ఫండ్ కింద వాస్తవంగా 2.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రవేు నిల్వ ఉండడం ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆస్తుల్లో సుమారుగా 6.5 శాతంగా ఉన్నది. మరి కేంద్ర ఆర్థిక శాఖ ఏవిధంగా 3.5 లక్షల కోట్ల రూపాయల కంటింజెన్సీ ఫండ్‌ను ఎలా కోరుతోందో అర్ధంకాని విషయం. ఇవన్నీ పట్టించుకోకుండా గతంలో ఎన్నడూ లేనివిధంగా రిజర్వ్‌బ్యాంక్‌ను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడం ద్వారా దాని స్వయంప్రతిపత్తిని హరించే యత్నాలకు నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రయత్నించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధవేునని చెప్పక తప్పదు. స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలపై పెరుగుతున్న ప్రభుత్వ పెత్తనం వల్ల ఆర్థికరంగంపై తీవ్ర ప్రభా వం చూపుతుంది. కేంద్రం ఈ విధంగా ఒక్కొక్క సంస్థను తమ ఆధీనంలోకి తెచ్చుకుని కబళించే యత్నాలను గట్టిగా ఆయా సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు, ప్రజాస్వామ్యప్రియులు ఎదిరించాల్సిన అవసరమైంతెనా ఉన్నది. 

ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయం పన్ను విభాగం, ఎన్నికల సంఘం, చివరకు న్యాయవ్యవస్థపై కూడా ఆర్‌ఎస్‌ఎస్, సంఘపరివార్ కూట మి నేతృత్వంలోని ప్రభుత్వ జోక్యం పెరిగి తమ భావజాలాన్ని జొప్పించే య త్నాలకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఏ ప్రభుత్వ రంగ సంస్థలోైనెనా విధాన పర నిర్ణయాల్లో తమ భావజాలానికి పెద్దపీట వేయాలన్నదే సంఘపరివార్ కుటిలయత్నం. విద్యావ్యవస్థలో కూడా ఆర్‌ఎస్‌ఎస్ పెత్తనం కొనసాగుతోందని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మారిన సిలబస్ రుజువుచేస్తోంది. బ్యాంకులు దివాలా స్థితిలోకి రావడానికి తమ మద్దతున్న కార్పొరేట్ వాణిజ్యవేత్తలే కారణమని సంఘ్‌పరివార్‌కు బాగా తెలుసు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించేందుకు, తమను మించిన దేశభక్తులు లేరనే భావన కలిగించేందుకు సర్దార్ పటేల్ విగ్రహ స్థాపన వంటి కార్యక్రమాలతో తిమ్మిని బ మ్మిని చేస్తున్నారు. ఇలాంటి ముసుగులో దేశంలోని అన్ని రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యంచేస్తూ వాటిలో కూడా తమ ముద్ర వేసేందుకు వెనుకాడని సంఘపరివార్ కార్యకలాపాలను అడ్డుకోకపోతే రాజ్యాంగ కర్తల స్ఫూర్తి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు తిలోదకాలిచ్చినట్టే కాగలదు. అందువల్ల ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్న ప్రభుత్వ విధానాలపై ప్రజాస్వామ్య ప్రియులు, మేధావులు కలిసికట్టుగా ఎదిరించి పోరాడకపోతే మళ్లీ దేశం అనాగరిక మనుస్వామ్యంలోకి జారిపోయే ప్రమాదం ఉన్నది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ సంస్థలపై దండెత్తేలా తమకు అనుకూలంగా వ్యవహరించేలా మార్చుకుంటూ పోతుంటే ప్రజాశ్రేయస్సు కాకుండా ప్రభుత్వాల, పార్టీల శ్రేయస్సుకే ఉపయోగపడుతుంది. అందువల్లనే ప్రభుత్వాలు తీసుకునే దుర్మార్గ చ ట్టాలు, దుర్వినియోగ విధానాలను ఎండగట్టవలసిన అవసరం ఉన్నది. ఆర్బీ ఐ వంటి ప్రభుత్వ సంస్థల స్వయం ప్రతిపత్తిని కాపడడం ప్రతి ఒక్కరి విధిగా భావించాలి. 

Tags
English Title
RBI
Related News