‘అరవింద సమేత’ టీం క్షమాపణలు చెప్పాల్సిందే

Updated By ManamTue, 10/16/2018 - 12:21
Trivikram

Trivikramఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అరవింద సమేత ఓ వైపు థియేటర్లలో దూసుకుపోతుంటే మరోవైపు వివాదాలు మాత్రం ఆగడం లేదు. తాను రాసిన రెండు కథల నుంచి ఈ సినిమాను తెరకెక్కించారంటూ వేంపల్లి గంగాధర్ అనే యువకుడు దర్శకుడు త్రివిక్రమ్‌పై ఆరోపణలు చేయగా.. రాయలసీమకు చెందిన కొన్ని సంఘాలు కూడా ఈ చిత్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా రాయలసీమ విద్యార్థి పోరాట సమితి చిత్ర యూనిట్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. మూలపడిన రాయలసీమ ఫ్యాక్షన్‌ను ఈ చిత్రంతో మళ్లీ గుర్తుచేశారని ఆ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా సినిమాలో రాయలసీమ ప్రాంతాన్ని కించపరిచేలా కొన్ని డైలాగులు, సీన్లు ఉన్నాయని అందుకే ఆ ప్రాంత ప్రజలందరికీ బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని వారు అంటున్నారు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

English Title
Rayalaseema students demands apology from Aravindha Sametha Makers
Related News