డ్యాన్సర్‌గా రవితేజ..?

Updated By ManamSat, 11/03/2018 - 10:13
Ravi Teja

Ravi Teja‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రంలో నటించబోతున్నాడు. ‘డిస్కో రాజా’ అనే  పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నబా నటేశ్.. ‘ఆర్ఎక్స్100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలో రవితేజ డిస్కో డాన్సర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్లే ‘డిస్కో రాజా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’లో నటించగా.. ఈ నెల 16న ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రవితేజ సరసన ఇలియానా నటించింది.

English Title
Ravi Teja playing dancer role in his next..?
Related News